తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-11-30T14:05:41+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నవంబర్ 29న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


రంజ్ (Ranj)

రంజ్ అనేది పంజాబీ చిత్రం 10 జూన్, 2022న విడుదలైంది. ఈ చిత్రానికి సునీత్ సిన్హా దర్శకత్వం వహించగా.. ఆదేశ్ సిద్ధు, నూతన్ సూర్య, మధు సాగర్, కుల్జీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ అదర్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


జాయ్‌రైడ్ (Joyride)

జాయ్‌రైడ్ అనేది ఎమెర్ రెనాల్డ్స్ దర్శకత్వం వహించిన ఐరిష్ బ్రిటీష్  హాస్య చిత్రం. ఈ చిత్రం 5 జూలై 2022న గాల్వే ఫిల్మ్ ఫ్లీడ్‌లో ప్రపంచ ప్రీమియర్‌గా ప్రదర్శించారు. అనంతరం 29 జూలై 2022న థియేటర్స్ లో విడుదలైంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Crime Scene: The Texas Killing Fields - ఇంగ్లిష్

Romesh Ranganathan: The Cynic - ఇంగ్లిష్


ఐట్యూన్స్ (iTunes)

Guidance - మాండరీన్

Updated Date - 2022-11-30T14:05:41+05:30 IST

Read more