తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-12-09T14:15:51+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా డిసెంబర్ 8న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


తగ్గెదే లే (Thaggede Le)

డ్రగ్ లార్డ్‌ని పట్టుకోడానికి, అలాగే మర్డర్ మిస్టరీ చేధించేందుకు ఎస్‌ఐ చలపతి (రవి శంకర్), అతని సబార్డినేట్ రాజా (రాజా రవీంద్ర) చేసే ప్రయత్నమే ‘తగ్గెదే లే’. అందులో భాగంగా.. ఈశ్వర్ (నవీన్ చంద్ర)ని ఒక దాబాకు తీసుకువచ్చి హత్య కేసుపై విచారించడం ప్రారంభిస్తారు. ఈ తరుణంలో ఆ ముగ్గురికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ ఈ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers)

ఎలిఫెంట్ విస్పరర్స్ అనేది ఏనుగుల సంరక్షణపై తీసిన ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్. తమిళనాడులో ఉండే ఓ జంట అనాథ ఏనుగుని పెంచుకుంటారు. ఈ తరుణంలో వారికి, ఆ ఏనుగుకి మధ్య ఏర్పడిన బంధం గురించి ఈ చిత్రం వివరిస్తుంది. అలాగే దక్షిణ భారతదేశంలోని అడవి ప్రదేశాల అందాన్ని కూడా చూపిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Harry & Meghan - ఇంగ్లిష్

Lookism - కొరియన్

Broken Wings - ఇండోనేషియన్

In Broad Daylight: The Narvarte Case - స్పానిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon  Prime)

The Bad Guy - ఇంగ్లిష్, ఇటాలియన్, పోర్చుగీస్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Tomorrow, I'll Be Someone's Girlfriend - జపనీస్

Updated Date - 2022-12-09T14:15:51+05:30 IST

Read more