సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సల్మాన్ ఖాన్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-02-27T16:31:10+05:30

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సల్మాన్‌ఖాన్‌ ఒకరు. ఈ స్టార్ హీరో ఇటీవలే దుబాయ్‌లో ఓ కాన్‌సర్ట్‌లో పాల్గొన్నాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సల్మాన్‌ఖాన్‌ ఒకరు. ఈ స్టార్ హీరో ఇటీవలే దుబాయ్‌లో ఓ కాన్‌సర్ట్‌లో పాల్గొన్నాడు. ద-బాంగ్ ది టూర్ రీలోడెడ్ పేరుతో నిర్వహించిన ఈ షోలో పూజా హెగ్డే, దిశా పటానీ, సోనాక్షి సిన్హా, మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ఆడిపాడారు.


తాజాగా ఈ షోలో పూజా హెగ్డే‌తో కలిసి ‘జుమ్మేకి రాత్’ సాంగ్‌కి ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే పాటకి డ్యాన్స్ చేసి అలసిపోయిన సల్లుభాయ్ ఆ పాటలోని హుక్ స్టెప్‌ని వేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దానికి పూజా వేసుకున్న డ్రెస్ చాలా షార్ట్‌గా ఉండడం, అలాగే సల్మాన్‌కి ఓపిక సరిపోకపోవడం కారణం. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో సల్మాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఎంతో భయకరంగా, చిరాకు కలిగించేలా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-02-27T16:31:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!