సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పాకిస్తానీ రెస్టారెంట్ Adలో Alia Bhatt సినిమా సీన్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

ABN, First Publish Date - 2022-06-20T18:33:18+05:30

అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi)’. సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi)’. సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 25న విడుదలై హిట్ అయ్యింది. ముఖ్యంగా సినిమాలో అలియా అద్భుత నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఓ వ్యక్తి గంగుభాయిని కామాటిపురలోని వేశ్యగా మార్చేస్తాడు. ఓ సీన్‌లో గంగుభాయి విటులను రమ్మని సైగ చేసే సీన్ ఉంటుంది.


ఆ సీన్‌ని ఓ పాకిస్థానీ రెస్టారెంట్ (Pakistani restaurant) చైన్ తమ బ్రాండ్ మార్కెటింగ్ కోసం వాడుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ఆ రెస్టారెంట్ సోమవారం రోజు పురుషులకు 25 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి పురుషులందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అన్నట్లు సైగ చేస్తున్నట్లు ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఆ రెస్టారెంట్ చేసిన పోస్ట్‌కి కొంచెం ఫన్నీగా క్యాప్షన్ సైతం ఇచ్చింది. అయితే.. ఇది చూసిన పలువురు భారతీయ నెటిజన్లు స్పందిస్తూ రెస్టారెంట్‌పై విమర్శలు చేస్తున్నారు.


‘ఎంత దయనీయమైన మార్కెటింగ్ వ్యూహం. ఖచ్చితంగా మీ మార్కెటింగ్ బృందాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. చాలా అసహ్యంగా ఉంది’ అని కొందరు.. ‘మీ దగ్గర ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నంత మాత్రాన.. ఇండియా నుంచి ఇలాంటి దొంగిలించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఎడిటింగ్‌ని మా దేశంలో చిన్నపిల్లలు కూడా చేస్తారు’ అంటూ మరికొందరూ.. ‘ఎంతో అసహ్యంగా ఉంది’ అంటూ ఇంకొందరూ కామెంట్స్ చేశారు.



Updated Date - 2022-06-20T18:33:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!