Janhvi Kapoor: ఫొటో షూట్‌తో ట్రోల్స్‌కు గురైన అందాల భామ

ABN , First Publish Date - 2022-09-24T22:27:08+05:30 IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ వంటి సినిమాలతో

Janhvi Kapoor: ఫొటో షూట్‌తో ట్రోల్స్‌కు గురైన అందాల భామ

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ వంటి సినిమాలతో అలరించింది. తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. జాన్వీకి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయర్స్‌కు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది. తాజాగా జాన్వీని నెటిజన్స్ ట్రోల్ చేశారు. అందుకు కారణమేంటంటే.. 


జాన్వీ కపూర్ తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. హాట్, హాట్‌గా ఫోజులిచ్చింది. ఆరెంజ్ కలర్ డ్రెస్ ధరించి ఆ పిక్స్‌లో కనిపించింది. దీంతో నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేశారు. అసభ్యమైన పదజాలంతో దూషించారు. కొంత మంది ‘అందమైన స్త్రీ మూర్ఖురాలు’ అంటూ కామెంట్ చేశారు. మరికొంత మంది పరుష పదజాలంతో.. ‘పోర్న్ స్టార్’ అని దూషించారు. అయితే, జాన్వీ కపూర్ ఈ ట్రోల్స్‌ను ఏ మాత్రం పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది. జాన్వీ కపూర్ చివరగా ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry)లో నటించింది. సిద్దార్థ్ సేన్‌గుప్తా (Sidharth Sengupta) దర్శకత్వం వహించాడు. సుబాస్కరన్, ఆనంద్ ఎల్.రాయ్ (Aanand L. Rai) సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో విడుదల అయింది. జులై 29నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో డ్రగ్స్‌ను సరఫరా చేసే యువతిగా ఆమె కనిపించింది. ఇక జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘మిల్లి’ షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసింది. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ లో నటిస్తుంది. రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నాడు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. వరుణ్ ధావన్‌కు జోడీగా ‘బవాల్’ లోను నటిస్తుంది.



Updated Date - 2022-09-24T22:27:08+05:30 IST