సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Brahmastra లో సీన్లన్నీ Aquaman సినిమా నుంచి కాపీ చేశారా..? నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

ABN, First Publish Date - 2022-06-20T22:52:21+05:30

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో కరణ్ జోహార్ (Karan Johar) పాన్ ఇండియాగా రూపొందించారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోను ఈ మూవీని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’  ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి అనేక కారణాల వల్ల వార్తల్లో నిలుస్తుంది. ట్రైలర్‌లోని ఓ సీన్‌తో కొంత మంది మనస్తాపానికి గురయ్యారు. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా స్పందించారు. 


తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాపై నెటిజన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. ఈ చిత్రంలోని సీన్స్ ‘ఆక్వామ్యాన్’ నుంచి కాపీ చేశారని నెట్టింట దుమ్మెత్తి పోస్తున్నారు. విపరీతంగా పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘..‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూశాక ఈ సీన్ ఆక్వామ్యాన్ లానే ఉంది’’ అని ఓ నెటిజన్ తెలిపారు. ‘‘ట్రైలర్‌లో ఆక్వామ్యాన్ జానీడెప్ కనిపించాడని మీకు తెలుసా’’ అని మరో నెటిజన్ చెప్పారు. ‘బ్రహ్మాస్త్ర’కు అనుకూలంగా కూడా కొంత మంది నెటిజన్స పోస్ట్‌లు పెడుతున్నారు. ‘‘పురాణ గాథల్లోని శివుని పాత్రను ఆధారంగా చేసుకుని ‘బ్రహ్మాస్త్ర’ ను రూపొందించారు. శివుని ఆయుధం శూలం. అందువల్ల కాపీ అనడం పూర్తిగా నిరాధారం’’ అని ఓ సోషల్ మీడియా యూజర్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శివ పాత్రలో రణ్‌బీర్ కపూర్, ఇషా పాత్రలో ఆలియా భట్ కనిపించనున్నారు. 







Updated Date - 2022-06-20T22:52:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!