సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vikram Vedha teaser: హృతిక్ రోషన్‌పై ట్రోలింగ్.. విజయ్ సేతుపతే కారణం..

ABN, First Publish Date - 2022-08-24T22:03:38+05:30

ఈ ఏడాది బాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీస్‌లో ‘విక్రమ్ వేద(Vikram Vedha)’ ఒకటి. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఏడాదిలో చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీస్‌లో ‘విక్రమ్ వేద(Vikram Vedha)’ ఒకటి. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2017లో వచ్చిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’కి ఇది రిమేక్. ఇందులో మాధవన్ పాత్రలో సైఫ్ అలీఖాన్, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పాత్రలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించారు. ఈ మూవీకి కూడా మాతృకకి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రినే డైరెక్షన్ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఇది ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.  


ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపటి నుంచి విజయ్ సేతుపతి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. హృతిక్, విజయ్ నటనని కంపేర్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. అందులో చాలామంది వారిద్దరిలో విజయ్‌నే బాగా చేశాడని, హృతిక్ నటన ఓవర్‌గా అనిపించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అదే మ్యూజిక్.. వర్షంలో ఫైట్ సీన్.. అవే డైలాగ్స్.. ఏది కొత్తగా లేదు. కానీ.. అది చూసిన తర్వాత హృతిక్ కంటే విజయ్ సేతుపతినే బెటర్ అనిపించింది’ అని ఒకరు.. ‘విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ని రిమేక్ చేయడానికి ప్రయత్నించకపోవడమే బెటర్.. ఎందుకంటే ఇండియాలో ఆయన్ని మించిన నటుడు మరొకరు లేరు’ అని మరొకరు.. ‘విజయ్ సహజ నటన వర్సెస్ హృతిక్ ఓవర్ యాక్షన్’ అని ఇంకొకరు ట్వీట్స్ చేశారు.















Updated Date - 2022-08-24T22:03:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!