Karan Johar Birthday Bash: గ్రీన్ డ్రెస్‌లో బాలీవుడ్ డైరెక్టర్.. అలా ఉన్నావంటూ ట్రోలింగ్..
ABN , First Publish Date - 2022-05-26T15:41:31+05:30 IST
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మే 25న 50వ పుట్టినరోజును జరుపుకున్నాడు. యష్ రాజ్ స్టూడియోస్‌లో..

బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ మే 25న 50వ పుట్టినరోజును జరుపుకున్నాడు. యష్ రాజ్ స్టూడియోస్‌లో ప్రముఖుల కోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, అమీర్ ఖాన్, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), హృతిక్ రోషన్ వంటి పలువురు స్టార్స్ హాజరయ్యారు. కరణ్ ఈ పార్టీని ‘బ్లాక్ అండ్ బ్లింగ్’ అనే థీమ్‌తో ఏర్పాటు చేశాడు. దీంతో ఈ దర్శకుడు ఆకుపచ్చ బ్లింగ్ జాకెట్‌ని ధరించాడు. దీనికి కాంబినేషన్‌గా తెల్ల చొక్కా, బ్లాక్ ప్యాంటుని ఎంచుకున్నాడు.
ఈ సందర్భంగా వేదిక వద్దకి వచ్చిన మీడియాకి ఫొటోలకి కరణ్ ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆకుపచ్చ జాకెట్ గురించి పలువురు నెటిజన్లు ట్రోలింగ్ (Trolling) చేయడం ప్రారంభించారు. ‘కొన్ని నక్షత్రాలు, గంటలు పెడితే, క్రిస్మస్ చెట్టు (Christmas tree)లా కనిపిస్తారు’ అంటూ ఓ నెటిజన్.. ‘కదులుతున్న కిస్మస్ ట్రీలా ఉన్నాడు’ అంటూ మరొకరు.. ‘కిస్మస్ ట్రీని చాలా త్వరగా బయటికి తీశావు’ అని ఇంకొందరు కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలంటే ఎంతో ధైర్యం ఉండాలంటూ మరికొందరు ప్రశంసలు సైతం కురిపిస్తున్నారు.