Nawazuddin Siddiqui: రూ.100కోట్లు తీసుకునే నటుల వల్ల సినీ ఇండస్ట్రీకే నష్టం

ABN , First Publish Date - 2022-12-15T17:19:19+05:30 IST

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘బజరంగీ భాయి జాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతంలో అనేక సార్లు బాలీవుడ్‌పై విమర్శలు గుప్పించాడు.

Nawazuddin Siddiqui: రూ.100కోట్లు తీసుకునే నటుల వల్ల సినీ ఇండస్ట్రీకే నష్టం

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui). ‘బజరంగీ భాయి జాన్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. గతంలో అనేక సార్లు బాలీవుడ్‌పై విమర్శలు గుప్పించాడు. తాజాగా బాలీవుడ్ హీరోలపై విరుచుకుపడ్డాడు. రూ.100కోట్ల పారితోషికం తీసుకునే నటుల వల్ల సినీ ఇండస్ట్రీకి నష్టం అని తెలిపాడు. హీరోలు భారీగా రెమ్యూనరేషన్స్ తీసుకోవడంతోనే సినిమా బడ్జెట్ పెరుగుతుందని తెలిపాడు. నిర్మాతలకు లాభాలు రావడం లేదని చెప్పాడు. అందువల్లే మూవీస్ ప్లాఫ్ అవుతున్నయన్నాడు. తాజాగా అతడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘బాక్సాఫీస్ వసూళ్లను గమనించడం నిర్మాత బాధ్యత. టిక్కెట్స్ అమ్మకాలు, ధరల గురించి నటుడు ఆలోచించకూదు. నటులు బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ గురించి మాట్లాడుతున్నారంటే అవినీతిగానే భావించాలి. రూ.100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల వల్ల సినిమాలకు నష్టం కలుగుతోంది. పరిమిత వ్యయంలో తక్కువ బడ్జెట్‌తో తీసే సినిమాలు ప్లాఫ్ కావు. ప్రతిసారి సినిమా పరిమితికి మించి ఖర్చు పెడితే పరాజయం పాలవుతుందని నా అంచనా. బడ్జెట్‌ మాత్రమే సినిమా హిట్టా, ఫ్లాఫ్ అనేది నిర్ణయిస్తుంది.. నటులు, దర్శకులు, రచయితలు ప్లాఫ్ కారు. మంచి కథలు, నైపుణ్యం ఉన్న వారికి డబ్బులు చెల్లించడానికి అందరు ఇష్టపడతారు. అది చరిత్ర చెబుతున్న సత్యం. నా వద్ద లక్ష కోట్ల డాలర్స్ ఉన్నప్పటికి మంచి ఐడియాపై ఆలోచించే శక్తి లేకపోతే ఆ ధనం వృథా. ఓ వ్యక్తి వద్ద అద్భుతమైన స్క్రిఫ్ట్ ఉంటే ఎంత చెల్లించైనా సరే దానిని కొనుక్కొవడానికి నిర్మాతలు వెంటపడతారు’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పాడు. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ కెరీర్ విషయానికి వస్తే.. ‘టికు వెడ్స్ షేరు’ లో నటించాడు. కంగనా రనౌత్ నిర్మించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో ఐదు ప్రాజెక్టులు అతడి చేతిలో ఉన్నాయి.

Updated Date - 2022-12-15T17:22:32+05:30 IST