ఆ కారణంతోనే బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకున్నానంటున్న హీరోయిన్

ABN , First Publish Date - 2022-03-28T01:56:47+05:30 IST

రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్‌కు

ఆ కారణంతోనే బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకున్నానంటున్న హీరోయిన్

రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘రాక్ స్టార్’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నర్గీస్ ఫక్రీ. ‘మద్రాస్ కేఫ్’, ‘మై తేరా హీరో’, ‘కిక్’ వంటి  చిత్రాల్లో నటించి అభిమానులను అలరించింది. చివరగా సంజయ్ దత్ కీలక పాత్రలో తెరకెక్కిన ‘టోర్భాజ్’ చిత్రంలో కనిపించింది. అనంతరం బాలీవుడ్‌కు దూరంగా వెళ్లిపోయింది. న్యూయార్క్‌లో తన తల్లిదండ్రులతో కలసి నివసించడం ప్రారంభించింది. తాను తిరిగి సినిమాల్లోకీ రావాలనుకున్నప్పటికీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదని చెప్పింది. తాజాగా నర్గీస్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. 


కొన్నేళ్ల క్రితం విరామం లేకుండా పనిచేయడంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నానని నర్గీస్ ఫక్రీ చెప్పింది. ఇండస్ట్రీకీ 2020లో తిరిగి రావాలనుకున్నప్పటికీ కరోనా వల్ల తన ప్రణాళికలు విఫలమయ్యాయని తెలిపింది. అనంతరం రెండేళ్లు వేచి చూసినప్పటికీ తన ఆలోచనలు కార్యరూపం దాల్చలేదని వెల్లడించింది. ఈ సందర్భంగా మహమ్మరి కాలాన్ని గుర్తు చేసుకుంది. ‘‘మార్చి, 2020లో నేను మెడిటేషన్ సెంటర్‌లో చేరాను. 10రోజులు ధ్యానం చేశాను. అనంతరం బయటికి వచ్చి చూశాక నేను షాకయ్యాను. కరోనా ఏ మాత్రం తగ్గలేదు. ఏప్రిల్,2020లో నేను ముంబైకి రావాలి. కానీ, కోవిడ్ వల్ల రాలేకపోయాను. 2016-2017లో నేను వరుసగా సినిమాలను చేశాను. అప్పుడు సంతోషంగానే ఉన్నాను. కొన్ని రోజుల అనంతరం ఒత్తిడికి గురయ్యాను. నా కుటుంబం, స్నేహితులను మిస్ అయ్యాను. ఏదో కోల్పోతున్నాననే భావన నాలో కలిగింది. శరీరం, మనస్సును బ్యాలెన్స్ చేయాలంటే ఏదో ఒక చోట ఆపాలి. అందుకే మూవీస్ నుంచి విరామం తీసుకున్నాను. న్యూయార్క్‌కు వెళ్లిపోయాను. నా తల్లిదండ్రులు, స్నేహితులతో సమయాన్ని వెచ్చించాను. మా అమ్మతో ప్రతి విషయాన్ని పంచుకున్నాను. మీరు మీ కుటుంబంతో గడిపిన సమాయన్ని ఏది కూడా భర్తీ చేయలేదు’’ అని నర్గీస్ ఫక్రీ స్పష్టం చేసింది. 

Updated Date - 2022-03-28T01:56:47+05:30 IST