సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అతిథి పాత్ర అయితే అస్సలు చేయను... ఆ డైరెక్టర్‌కి Nagarjuna ఎందుకలా చెప్పాడంటే...

ABN, First Publish Date - 2022-01-15T02:52:14+05:30

‘‘మొదట్లో నాకు కొంచెం అనుమానంగానే ఉండేది...’’ అంటున్నాడు ‘కింగ్’ ఆప్ టాలీవుడ్ నాగార్జున. ఆయన బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ గురించి మాట్లాడుతూ అలా కామెంట్ చేశాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మొదట్లో నాకు కొంచెం అనుమానంగానే ఉండేది...’’ అంటున్నాడు ‘కింగ్’ ఆప్ టాలీవుడ్ నాగార్జున. ఆయన బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ గురించి మాట్లాడుతూ అలా కామెంట్ చేశాడు. రణబీర్, ఆలియా జంటగా రూపొందిన సూపర్ హీరో మూవీలో మన నాగ్ కూడా కీలక పాత్ర పోషించాడు. అయితే, మొదట్లో మాత్రం ‘బ్రహ్మాస్త్ర’ గురించి ఆయనకు కొంత అనుమానంగా ఉండేదట!


రణబీర్, ఆలియాతో పాటూ అమితాబ్ కూడా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి దర్శకుడు అయాన్ ముఖర్జీ. అయితే, ఆయనతో తనకు అతిథి పాత్ర చేసే ఉద్దేశం లేదంటూ నాగార్జున సూటిగానే చెప్పాడట. కథలో ప్రధానమైన క్యారెక్టర్ అయితేనే తాను చేయదలుచుకున్నట్టు అయాన్‌కి నాగ్ చెప్పటంతో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ అప్పటికే షూట్ చేసిన కొంత భాగం ప్రత్యేకంగా చూపించారట. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పనితనం నచ్చటంతో వెంటనే నాగ్ ఓకే అనేశాడట. ఇక ‘బ్రహ్మాస్త్ర’లో తనది కీలక పాత్ర అంటోన్న అక్కినేని స్టార్ చాలా గ్యాప్ తరువాత బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. చూడాలి మరి, ఆయనకు ఎటువంటి బ్రహ్మాండమైన విజయం ఎదురవుతుందో... 

Updated Date - 2022-01-15T02:52:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!