Naga Chaitanya తొలి బాలీవుడ్ మూవీ ట్రైలర్ విడుదల.. అసంతృప్తిలో ఫ్యాన్స్
ABN, First Publish Date - 2022-06-01T14:08:39+05:30
టాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో నాగ చైతన్య ఒకరు. ‘జోష్’ మూవీతో అక్కినేని వారసుడిగా..
టాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో నాగ చైతన్య ఒకరు. ‘జోష్’ మూవీతో అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ నటుడు తొలినాళ్లలోనే మంచి స్టార్‌డమ్‌ని అందుకున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో ఆయన నటించిన తొలి చిత్రం ‘Laal Singh Chaddha’. ఆమిర్ ఖాన్ హీరో, కరీనా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్ (Forrest Gump)’కి రిమేక్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ని అందుకుంది. అయితే.. ఈ ట్రైలర్ విషయమై నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిలో ఉన్నారు.
నిజానికి.. ‘ఫారెస్ట్ గంప్’ సినిమాలోని ఓ ముఖ్యమైన పాత్ర పేరు ‘బుబ్బా’. ఆ క్యారెక్టర్‌నే ‘లాల్‌సింగ్ చద్ధా’లో నాగచైతన్య చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆ పాత్రకి నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది. కానీ.. ఈ మూవీ ట్రైలర్లో మాత్రం నాగచైతన్యకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన కేవలం 3, 4 షాట్లలో మాత్రమే కనిపిస్తాడు. దీంతో నాగచైతన్య ‘బ్లింక్ అండ్ మిస్’లా అలా కనిపించి.. ఇలా మాయమయ్యాడు. ఇది ఊహించని ఆయన ఫ్యాన్స్ అసంతృప్తిలో ఉన్నారు. అయితే.. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. మొదటి సినిమాతోనే నాగచైతన్య బాలీవుడ్లో మంచి గుర్తింపు సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.