Naga Chaitanya తొలి బాలీవుడ్ మూవీ ట్రైలర్ విడుదల.. అసంతృప్తిలో ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-06-01T14:08:39+05:30 IST

టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో నాగ చైతన్య ఒకరు. ‘జోష్’ మూవీతో అక్కినేని వారసుడిగా..

Naga Chaitanya తొలి బాలీవుడ్ మూవీ ట్రైలర్ విడుదల.. అసంతృప్తిలో ఫ్యాన్స్

టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో నాగ చైతన్య ఒకరు. ‘జోష్’ మూవీతో అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ నటుడు తొలినాళ్లలోనే మంచి స్టార్‌డమ్‌ని అందుకున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో ఆయన నటించిన తొలి చిత్రం ‘Laal Singh Chaddha’. ఆమిర్ ఖాన్ హీరో, కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్ (Forrest Gump)’‌కి రిమేక్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. అయితే.. ఈ ట్రైలర్ విషయమై నాగ చైతన్య ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిలో ఉన్నారు.


నిజానికి.. ‘ఫారెస్ట్ గంప్’ సినిమాలోని ఓ ముఖ్యమైన పాత్ర పేరు ‘బుబ్బా’. ఆ క్యారెక్టర్‌నే ‘లాల్‌సింగ్ చద్ధా’లో నాగచైతన్య చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆ పాత్రకి నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది. కానీ.. ఈ మూవీ ట్రైలర్‌లో మాత్రం నాగచైతన్యకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన కేవలం 3, 4 షాట్లలో మాత్రమే కనిపిస్తాడు. దీంతో నాగచైతన్య ‘బ్లింక్ అండ్ మిస్’లా అలా కనిపించి.. ఇలా మాయమయ్యాడు. ఇది ఊహించని ఆయన ఫ్యాన్స్ అసంతృప్తిలో ఉన్నారు. అయితే.. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని.. మొదటి సినిమాతోనే నాగచైతన్య బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - 2022-06-01T14:08:39+05:30 IST