సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Alia Bhatt-Ranbir Kapoor wedding: అన్నీ సంగతులు.. అప్పుడే చెబుతానంటున్న అలియా భట్ బాబాయ్

ABN, First Publish Date - 2022-04-10T17:55:11+05:30

రణ్‌బీర్ కపూర్, అలియా భట్.. ప్రస్తుతం బాలీవుడ్‌ జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటోంది ఈ జంట పెళ్లి గురించే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణ్‌బీర్ కపూర్, అలియా భట్.. ప్రస్తుతం బాలీవుడ్‌ జనాలు ఈ జంట పెళ్లి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. గత రెండేళ్లుగా వీరి వివాహం గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. అయితే సమయం గడిచే కొద్ది అవి పుకార్లుగానే మిగిపోయాయి. విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌ పెళ్లి సందర్భంలోనూ ఈ రూమర్స్ నెట్టింట హల్‌చల్‌ చేశాయి. తాజాగా సైతం వారి మ్యారేజ్ త్వరలోనే జరగబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అది కూడా ఏప్రిల్ 13 నుంచి 17 తేదీల్లో ఎంతో గ్రాండ్‌గా ఈ ఈవెంట్ జరగబోతోందని వినిపిస్తోంది. దీనిపై అలియా భట్ బాబాయ్‌, ప్రముఖ నిర్మాత ముఖేశ్ భట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.


ముఖేశ్ భట్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి రణ్‌బీర్, అలియా పెళ్లి గురించి ఏ విషయం గురించి మాట్లాడే స్థితిలో లేను. మా వదిన ఇప్పటికే వారి వివాహం గురించి మాట్లాడటానికి నిరాకరించింది కదా. అయితే పెళ్లి తర్వాత ఎలా జరిగింది.. ఎవరెవరు వచ్చారని అన్ని విషయాలను ఇంటర్య్వూ ద్వారా వెల్లడిస్తా. ఇప్పటికైతే దాని గురించి మాట్లాడదలచుకోలేదు’ అని చెప్పాడు.


అయితే.. ఇటీవలే అలియాతో పెళ్లి పుకార్ల గురించి రణ్‌బీర్ తల్లి నీతు కపూర్ మాట్లాడుతూ.. ‘నేను కూడా చాలా పుకార్లు వింటున్నాను. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి వారు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే.. ఇలా రూమర్స్ గత రెండేళ్లుగా వస్తున్నాయి. ఇప్పుడైతే.. వారు రాజస్థాన్‌లో, కొన్నిసార్లు ఎక్కడైనా, ఇంకోసారి ఆర్‌కే స్టూడియోలో పెళ్లి చేసుకుంటారని రూమర్స్ వస్తున్నాయి. అయితే వీటి గురించి నాకేం తెలియదు. కానీ.. నిజమవ్వాలని కోరుకుంటున్నా. కానీ అలియా, రణ్‌బీర్‌ని నమ్మలేం. ఎందుకంటే.. వృత్తిగతంగా వారి వారి ప్రపంచాల్లో బిజీగా ఉన్నారు. కానీ వాళ్లిద్దరూ ఏదైనా చేయగలరు. ఏమో ఎవరికీ తెలుసు ఈ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే వారు పెళ్లి చేసుకొని ఉండొచ్చు కూడా’ అంటూ డిఫరెంట్‌గా స్పందించింది.

Updated Date - 2022-04-10T17:55:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!