Mukesh Khanna: నగ్నంగా చూపించే ఆస్కారం ఉంది.. శక్తిమాన్ ఫైర్
ABN , First Publish Date - 2022-12-17T12:31:33+05:30 IST
‘పఠాన్’ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ పెద్ద దుమారమే లేపుతోంది. ఆ పాటలో దీపికా పడుకోన్ బికినీ ధరించి హాట్‌గా కనిపించడం పట్ల ఇప్పటికే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘పఠాన్’ (Pathan)చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ (Besharam Rang)సాంగ్ పెద్ద దుమారమే లేపుతోంది. ఆ పాటలో దీపికా పడుకోన్ (Deepika padukone bikini) బికినీ ధరించి హాట్‌గా కనిపించడం పట్ల ఇప్పటికే చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేశ్ ఖన్నా (Mukhesh khanna)(శక్తిమాన్) ఈ పాటపై వ్యంగ్యాస్త్రలు సంధించారు. ‘బేషరమ్ రంగ్’ పాట చూడటానికి చాలా అసభ్యకరంగా ఉందని మండిపడ్డారు. ఎదుటివారి ఫీలింగ్స్‌ను రెచ్చగొట్టేలా ఉందని అన్నారు. ఇలాంటి పాటకు సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతి ఇచ్చింది అని ప్రశ్నించారు. ఈ మేరకు ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ ‘‘సినీ పరిశ్రమ దారి తప్పింది. రోజురోజుకి సినిమాల్లో అశ్లీలత ఎక్కువవుతుంది. ఇప్పుడు కురచ దుస్తుల్లో కథానాయికల్ని చూపిస్తున్న మేకర్స్ భవిష్యత్తులో వాళ్లను నగ్నంగా చూపించే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మనది స్పెయిన్, స్వీడన్ దేశం కాదు. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలకు భంగం కలగకుండా సినిమాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డ్‌కు ఉంది. నేటి యువతను దారి తప్పించే చిత్రాలకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వకూడదు. ఎదుటి వారిని రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి వస్త్రధారణను ఈ పాటలో ఎలా అంగీకరించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘బేషరమ్ రంగ్’ సాంగ్ దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! ఈ పాటలో దీపిక దుస్తులు మరీ కురచగా ఉన్నాయని ఆ పాటను తొలగించాలనీ, సినిమాను బ్యాన్ చేయాలని ఉత్తరాదిలోని పలు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. సినిమాలో మార్పులు చేయకపోతే విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీనిపై షారుక్‌ఖాన్ కూడా ఓ అవార్డ్ ఫంక్షన్‌లో స్పందించిన సంగతి తెలిసిందే!