Mrunal Thakur : కుండలా కాదు పియర్లా ఉంటానంటోన్న ‘ఇండియన్ కర్ధాషియాన్’!
ABN, First Publish Date - 2022-04-24T03:09:33+05:30
బాలీవుడ్ అప్‌కమింగ్ బ్యూటీస్‌లో అటు టాలెంట్, ఇటు అందంతో ఆకట్టుకుంటోన్న ఆమె వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. అయితే, అందుకు తగ్గట్టే మృణాళ్ విషయంలో సొషల్ మీడియా ట్రోలింగ్ కూడా సాగుతోంది...
అవును... నాది ‘పియర్’ పండు షేపులో ఉండే బాడీ... అయితే ఏంటి అంటోంది మృణాళ్ ఠాకూర్. బాలీవుడ్ అప్‌కమింగ్ బ్యూటీస్‌లో అటు టాలెంట్, ఇటు అందంతో ఆకట్టుకుంటోన్న ఆమె వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతోంది. అయితే, అందుకు తగ్గట్టే మృణాళ్ విషయంలో సొషల్ మీడియా ట్రోలింగ్ కూడా సాగుతోంది . కొన్నాళ్ల కిందట ఓ నెటిజన్ ఆమెను ‘కుండ’లా ఉంటావ్ అనటం పెద్ద చర్చకు దారి తీసింది. అప్పట్లో ఆమె తనది కుండలా ఉండే రూపమేనంటో ఇంటర్వ్యూలో బదులిచ్చింది. కానీ, ‘బాడీ షేమింగ్’ ఆపలని సూచించింది. అందరూ ఒకేలా ఉండరనీ, ఎవరు ఎలా ఉంటే అలా స్వీకరించటం నేర్చుకోవాలని హితవు పలికింది. అంతే కాదు, తనకు చాలా మంది పరిశ్రమలోని వారు కూడా ‘శరీరంలోని కింద భాగం’ తగ్గించుకోమని చెప్పారట! మృణాళ్ అలా చేసే ప్రసక్తే లేదని అంటోంది...
తన బాడీ షేప్ గురించి తాజాగా మరోసారి ప్రస్తావించిన మృణాళ్ ఠాకూర్ ‘పియర్ షేప్డ్’ అంటూ తనని తాను ప్రకటించుకుంది. పియర్ పండు ఆకారంలో తన రూపం ఉంటుందని చెప్పిన ఆమె, యూఎస్‌లో ఉండగా, తనని చాలా మంది ‘ఇండియన్ కర్ధాషియాన్’ అనేవారంటూ గర్వంగా చెప్పుకొచ్చింది! అమెరికన్ టెలివిజన్ సెలబ్రిటీ కిమ్ కర్ధాషియాన్ అందచందాల గురించి మనకు తెలిసిందే కదా... ఆమెతో పోల్చటం ఆనందపడాల్సిన విషయం అంటోంది మృణాళ్. కానీ, అమెరికన్స్ పడి చచ్చే తన లాంటి సెక్సీ ఫిగర్ అండ్ బాడీ షేప్ ఇండియాలో మాత్రం ట్రోలింగ్కి కారణం అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా కూడా ట్రోలర్స్‌ను చూసి ఏ అమ్మాయి భయపడవద్దని, కృంగిపోవద్దని చెబుతోంది. ఎవరి ఫిగర్ ఎలా ఉన్నా అందరూ ప్రత్యేకమే అంటోంది!