సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Brahmastra Teaser.. Mouni Roy పై నెటిజన్ల సెటైర్లు..VFX పై ట్రోలింగ్ మామూలుగా లేదుగా..!

ABN, First Publish Date - 2022-06-03T00:09:47+05:30

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్(Alia Bhatt) హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీరాయ్(Mouni Roy)కీలక పాత్రలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్(Alia Bhatt) హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra). అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనీరాయ్(Mouni Roy)కీలక పాత్రలు పోషించారు. కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో సెప్టెంబర్ 9న విడుదల కాబోతుంది. ఎక్కువ మంది ప్రేక్షకులు చిత్రాన్ని చూడాలనే ఉద్దేశంతో హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ఈ మూవీని దక్షిణాది భాషల్లో సమర్పి‌స్తున్నారు. 


‘బ్రహ్మాస్త్ర’ ను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా జూన్ 15న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. సినిమాలోని కీలక పాత్రధారుల లుక్‌లను చూపిస్తూ చిత్ర బృందం టీజర్ ట్రైలర్‌ను ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో విడుదలైనప్పటి నుంచి అందరు లుక్‌ల గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. కానీ, కొంత మంది నెటిజన్స్ మాత్రం మౌనీరాయ్ లుక్‌పై సెటైర్లు వేయడం ప్రారంభించారు. మౌనీరాయ్ లుక్ మార్వెల్ కామిక్స్ ‘వాండా మాక్సిమాఫ్’ (Wanda Maximoff)లా ఉందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ‘‘నాగిన్ సీరియల్ వీఎఫ్ఎక్స్ టీంతో సినిమాను నిర్మిస్తున్నారా’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘వీఎఫ్‌ఎక్స్ దారుణంగా ఉంది. కథ బాగుంటుందని ఆశిస్తున్నాను’’ అని మరో నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Updated Date - 2022-06-03T00:09:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!