సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Boycott Laal Singh Chaddha: మోనాసింగ్ ప్రశ్నాస్త్రాలు.. ఆమీర్ ఖాన్ దీనికి అర్హుడేనా అంటూ..

ABN, First Publish Date - 2022-08-15T16:54:32+05:30

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ (Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా(Laal Singh Chaddha)’. 1994 హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రిమేక్‌గా వచ్చిన ఈ మూవీ దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కరీనా కపూర్ (Kareena Kapoor), టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య (Naga Chaitanya) కీలకపాత్రలు పోషించిన ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.


అయితే.. గత కొన్నేళ్ల క్రితం ఆమీర్ ఖాన్.. ‘భారతదేశంలో అసహనం పెరిగిపోతోంది. అందుకే నా భార్య (కిరణ్ రావు) పిల్లల భవిష్యత్తు కోసం దేశం విడిచి వెళ్లిపోదామంటోంది’ అని వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో ఆ కామెంట్స్ పెద్ద దూమారాన్నే రేపాయి. దాని ప్రభావం ప్రస్తుతం ఆయన కొత్త సినిమా మీద పడింది. దాంతో.. అది నచ్చని కొంతమంది నెటిజన్లు ‘Boycott Laal Singh Chaddha’ అంటూ విడుదలకి చాలారోజుల ముందునుంచే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. దాంతో విడుదలకి ముందు ఆమీర్ ఆయనకి భారతదేశం మంటే చాలా ఇష్టమని, తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించమని కోరాడు. అయినప్పటికీ దాని ప్రభావం సినిమా మీద గట్టిగా పడింది.


దీంతో విడుదలకి ముందు ఎంతో బజ్ క్రియేట్ చేసిన మూవీకి మొదటి రోజు కేవలం రూ.14 కోట్ల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా మొదటి నాలుగు రోజుల్లో కేవలం రూ.40 కోట్ల వసూళ్లని మాత్రమే ఈ మూవీ సాధించి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరిస్థితిపై తాజాగా ఆమీర్ గతంలో కొన్ని సినిమాల్లో కలిసి నటించిన మోనా సింగ్ (Mona Singh) స్పందించింది.


మోనా మాట్లాడుతూ.. ‘నాకు చాలా బాధగా ఉంది. ఆమీర్ ఏం చేశాడని ఇలా జరుగుతోంది. బాయ్‌కాట్ చేయడానికి ఆమీర్‌ చేసి తప్పేంటి. ఆయన ఇలాంటి అనుభవం పొందడానికి అర్హుడేనా?. ఆయన మనల్ని గత 30 ఏళ్లుగా మనల్ని నటనతో అలరిస్తున్నాడు. ఈ సినిమా ప్రతి భారతీయుడిని ప్రతిబింబిస్తుంది. అది తెలుసుకున్న మరుక్షణం చాలామంది బాయ్‌కాటర్లు సినిమాని చూస్తారు’ అని చెప్పుకొచ్చింది.


కాగా.. ఈ సినిమాపై నెటిజన్ల కోపానికి కారణం ఆమీర్‌ఖాన్ వ్యాఖ్యలు మాత్రమే కాదు. కరీనా కూడా. గతంలో ఓ ఇంటర్య్వూలో నెపోటిజంపై కరీనా స్సందించింది. అందులో నటి మాట్లాడుతూ.. ‘అందరూ స్టార్ కిడ్స్, నెపోటిజం అంటూ విమర్శలు చేస్తున్నారు. మా సినిమాలు చూడమని మేం చెప్పలేదు కదా. చూడకుండా ఉండండి’ అంటూ కొంచెం వెటకారంగా మాట్లాడింది. దాని ప్రభావం కూడా ఈ సినిమాపై చాలా పడింది.

Updated Date - 2022-08-15T16:54:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!