సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బెడ్రూం బాల్కనీలోకి దూరి భయపెట్టాడు.. అప్పట్లోనే Priyanka Chopra కు షాకింగ్ అనుభవం..

ABN, First Publish Date - 2022-05-09T21:12:08+05:30

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). బీ టౌన్‌లోనే స్టార్ హీరోల సరసన చిత్రాలు చేసి అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికగా ఎదిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra). బీ టౌన్‌లో స్టార్ హీరోల సరసన చిత్రాలు చేసి అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికగా ఎదిగింది. ప్రియాంక 2000లో మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుని ఓవరనైట్ సెన్సేషన్‌గా మారింది. ప్రాంతీయంగా జరిగిన పలు పోటీల్లోను ఆమె పాల్గొంది. దీంతో ప్రియాంకకు సొంత పట్టణమైన బరైలీలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ క్రేజ్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఓ సారి ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురయింది. గతంలో ఓ బాలుడు బెడ్రూం బాల్కనీలోకి దూరి ఆమెను భయపెట్టాడు. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళ్లితే..


ప్రియాంక చోప్రా బెడ్రూంలో నిద్రపోతుండగా ఓ బాలుడు టెర్రస్ నుంచి బాల్కనీలోకి దూకాడు. బాల్కనీ కిటీకి నుంచి తదేకంగా చూస్తుండటంతో ఆమె భయపడిపోయింది. అక్కడికీ వచ్చిన వ్యక్తి ఎవరో ప్రియాంకకు తెలియదు. దీంతో భయపడిపోయి తన తండ్రికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రోజునే ప్రియాంక తల్లిదండ్రులు ఇంటి చుట్టూ ఇనుప రాడ్లు బిగించారు. ఒక వేళ ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించిన బయటికి పోలేనంతగా చుట్టూ రక్షణ కల్పించారు. ఈ ఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వొస్తుందని చెప్పింది  ఈ అందాల భామ.  ప్రియాంక చోప్రా దశాబ్దనికీ పైగా సినీ ఇండస్ట్రీలో కెరీర్‌ను కొనసాగిస్తుంది. రెండు జాతీయ అవార్డులు, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం ఆమెకు ‘పద్మ శ్రీ ’( Padma Shri) ని ఇచ్చి గౌరవించింది. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రియాంక చోప్రా.. ‘క్రిష్’ (Krrish), ‘డాన్’ (Don), ‘మేరికోం’ (Mary Kom) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

Updated Date - 2022-05-09T21:12:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!