రహస్యంగా షూటింగ్‌లో పాల్గొంటున్న సుస్మితాసేన్ మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్.. ఎందుకోసమంటే..?

ABN , First Publish Date - 2022-03-04T23:58:05+05:30 IST

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్

రహస్యంగా షూటింగ్‌లో పాల్గొంటున్న సుస్మితాసేన్ మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్.. ఎందుకోసమంటే..?

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్‌ను ప్రేమించిన సంగతి తెలిసిందే. ఈ జంట ఒకరికొకరు సోషల్ మీడియా వేదికగా 2018లో పరిచయమయ్యారు. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో తనకంటే 15ఏళ్లు చిన్నవాడైన రోహ్మాన్‌తో ఆమె డేటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఏమైందో తెలియదు కానీ, ఈ జంట కొన్ని రోజుల క్రితమే తమ బంధానికి బ్రేకప్ చెప్పింది. 


తాజాగా రోహ్మాన్‌కు సంబంధించిన ఓ వార్త బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. సినిమాల్లోకి అతడు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రోహ్మాన్ 2017నుంచే నటనకు సంబంధించిన కోర్సులు కూడా నేర్చుకుంటున్నాడు. అతడు నటిస్తున్న ప్రాజెక్టు వివరాలన్ని అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వార్తలపై రోహ్మాన్ కూడా స్పందించాడు. ‘‘నా మీద కొంత భాగాన్ని షూట్ చేసిన మాట వాస్తవమే. నిర్మాతల నుంచి అనుమతి రాగానే అందుకు సంబంధించిన వివరాలను నేనే వెల్లడిస్తాను. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. మీ దీవెనలు నాకు కావాలి’’ అని అతడు చెప్పాడు.


సుస్మితా సేన్, రోహ్మాన్ షాల్ తమ బంధం ముగిసిపోయిందని కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సుస్మితాసేన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ మెసేజ్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘స్నేహితులుగా బంధాన్ని మొదలుపెట్టాం. స్నేహితులుగానే ఉంటాం. రిలేషన్ షిప్ మాత్రం ముగిసిపోయింది’’ అని ఆమె తెలిపింది.

Updated Date - 2022-03-04T23:58:05+05:30 IST