Indian Beauty pageants: ప్రపంచ అందాల పోటీల్లో మెరిసిన భారతీయ భామలు
ABN, First Publish Date - 2022-08-22T15:46:04+05:30
పలువురు భారతీయ అందాల భామలు ప్రపంచస్థాయి అందాల పోటీల్లో(Beauty pageants) విజేతలుగా(Winners from India) నిలిచి దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పారు...
ముంబయి: పలువురు భారతీయ అందాల భామలు ప్రపంచస్థాయి అందాల పోటీల్లో(Beauty pageants) విజేతలుగా(Winners from India) నిలిచి దేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పారు.మిస్ యూనివర్స్ పోటీల్లో తల్లులు, వివాహిత మహిళలను అనుమతించిన నేపథ్యంలో భారతదేశం నుంచి పలువురు అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు తల్లులు, వివాహితులకు పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ మిస్ యూనివర్స్ పోటీ ప్రకటన ఇటీవల విడుదల అయింది.గతంలో ఏడుగురు భారతీయ భామలు ప్రపంచ అందాల పోటీల్లో సత్తా చాటి కిరిటాలను దక్కించుకున్నారు.మిస్ యూనివర్స్ పోటీల్లో హర్నాజ్ సంధు(Harnaaz Sandhu),సుస్మితాసేన్(Sushmita Sen), లారా దత్తాలు(Lara Dutta) విజేతలయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో భారతీయ అందాల భామలు రీటా ఫరియా(Reita Faria),ఐశ్వర్యారాయ్(Aishwarya Rai), యుక్తాముఖి(Yukta Mookhey), ప్రియాంకచోప్రా(Priyanka Chopra),మానుషి ఛిల్లార్ లు((Manushi Chhillar) ప్రపంచ అందాల కిరీటాలను దక్కించుకున్నారు.
అందంతో ఆత్మవిశ్వాసం కీలకం...
గతంలో ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల మహిళల అందాల పోటీలు(Beauty pageants) సాగుతున్నాయి. మిస్ యూనివర్స్ పోటీల్లో వివాహిత మహిళలు మిస్ వరల్డ్(Miss World), మిస్ యూనివర్స్(Miss Universe), మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ అందాల పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అందాల భామలు పాల్గొంటున్నారు. అందాల పోటీలు అంతర్జాతీయ స్థాయిలో అయినా, చిన్న స్థాయిలో దేశాలు, రాష్ట్రాల వారీగా జరిగిన మహిళల అందంతో,వారి ఆత్మవిశ్వాసం విజేతలను నిర్ణయిస్తోంది. బాహ్య అందంతోపాటు వారి ఆత్మవిశ్వాసం బ్యూటీ కాంటెస్ట్ లో విజేతలను వరిస్తోంది. అందాల పోటీలంటే మహిళలు ర్యాంప్ వాక్ లో వారి అందాన్ని ప్రదర్శించడమే కాకుండా వారి టాలెంట్, ఆత్మవిశ్వాసం, మహిళా సాధికారత విజేతను నిర్ణయిస్తున్నాయి.
అందాల పోటీల చరిత్ర
మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అందాల పోటీలను రెండు వేర్వేరు సంస్థలు చాలా ఏళ్లుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే మహిళల ఎంపిక పద్ధతులు వేర్వేరుగా ఉన్నాయి. భారతదేశం విషయానికి వస్తే ఫెమీనా మిస్ ఇండియా( Miss Femina India) విజేతను మిస్ వరల్డ్ పోటీలకు పంపిస్తున్నారు. యూకే కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ కాంటెస్ట్ సంస్థ మిస్ వరల్డ్ ను 1951వ సంవత్సరంలో ఎరిక్ మోర్లీ ప్రారంభించారు. నాలుగు ప్రపంచ అందాల పోటీల్లో మిస్ వరల్డ్ పోటీ అతి పురాతన మైంది. 1952వ సంవత్సరంలో ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీలను మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. మిస్ యూనివర్స్ పోటీలను మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ నడుపుతోంది.మిస్ వరల్డ్ పోటీల్లో ఇప్పటివరకు ఆరుగురు భారతీయ మహిళలు విజేతలయ్యారు. 1966వ సంవత్సరంలో మొట్టమొదటిసారి రీటా ఫరియా(Reita Faria) అనే ముంబయి అందాల భామ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు.డాక్టర్ అయిన రీటా ఫస్ట్ ఏసియన్ మహిళగా నిలిచారు.1994వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖనటి ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) మిస్ వరల్డ్ విజేత అయ్యారు.భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు(Harnaaz Sandhu of India was crowned Miss Universe 2021) మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని కైవసం చేసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన హర్నాజ్ సంధు ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మిస్ యూనివర్శ్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. హర్నాజ్ సంధు కంటే ముందు ఇద్దరు భారతీయ మహిళలు మాత్రమే మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
ముగ్గురు భారత అందాల భామలకు మిస్ యూనివర్స్ కిరీటం
1994వ సంవత్సరంలో సినీనటీమణులు సుస్మితా సేన్, 2000వ సంవత్సరంలో మరో ప్రముఖనటి లారా దత్తాలు మిస్ యూనివర్స్(Miss Universe title actresses Sushmita Sen, Lara Dutta) విజేతలయ్యారు. 1994వ సంవత్సరంలో సుస్మితాసేన్(Sushmita Sen) మొదటిసారి మిస్ యూనివర్స్ గా నిలిచి భారతదేశ పేరు ప్రతిష్ఠలను పెంచారు. హైదరాబాద్ (Hyderabad)నగరంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కుమార్తె అయిన సుస్మితాసేన్ బెంగాలీ. మిస్ వరల్డ్ విజేత అయ్యాక సుస్మితాసేన్ పలు సినిమాల్లో నటించారు. ప్రస్థుతం లలిత్ మోదీతో లివింగ్ రిలేషన్ షిప్ ఉన్న సుస్మితాసేన్ ఇటీవల వార్తల్లోకి ఎక్కారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరానికి చెందిన లారాదత్తా(Lara Dutta) 1977లో సిప్రస్ లో జరిగిన అందాల పోటీల్లో(Miss World Beauty Pageant) మిస్ ఇంటర్ కాంటినెంటల్( Miss Intercontinental) కిరీటాన్ని దక్కించుకున్నారు. 2000వ సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా నిలిచిన లారాదత్తా బాలీవుడ్ సినిమాల్లో నటించారు.
సినిమాల్లో రాణిస్తున్న నాటి అందాల భామలు
నాటి ప్రపంచ అందాల భామలు సినిమాల్లో రాణిస్తున్నారు. 2023వ సంవత్సరంలో మిస్ యూనివర్శ్ 72వ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మహిళలు వారి అందాన్ని, మనోజ్ఞతను ప్రపంచానికి ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు.ఇంతకుముందు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతులు, వివాహం చేసుకోని లేదా పిల్లలు లేనివారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించారు. నాటి మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ తన అందచందాలు, అభినయంతో బాలీవుడ్(Bollywood) రంగంలో నటిగా రాణిస్తున్నారు. 1999వ సంవత్సరంలో బెంగళూరు(Bangalore) భామ యుక్తాముఖి(Yukta Mookhey) మిస్ వరల్డ్ కిరీటాన్ని గెల్చుకున్నారు. అంతకు ముందు యుక్తాముఖి ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. 2002వ సంవత్సరంలో బాలీవుడ్, హాలివుడ్ నటి ప్రియాంకచోప్రా(Priyanka Chopra) మిస్ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకుంది. 2017లో మానుషి ఛిల్లార్ (Manushi Chhillar)ఫెమీనా మిస్ ఇండియాతో పాటు మిస్ వరల్డ్ గా నిలిచారు.