Alia Bhatt గొంతుతో పిజ్జా ఆర్డర్ చేసిన మిమిక్రీ ఆర్టిస్ట్! తరువాత ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-04-08T01:02:27+05:30 IST

బాలీవుడ్ ని ఫాలో అయ్యే సొషల్ మీడియా యూజర్స్ కి బాగా తెలిసిన పేరు చాందిని. ఆమె మిమిక్రీ చేస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే, చాందిని లెటెస్ట్ గా అప్ లోడ్ చేసిన ఓ సొషల్ మీడియా వీడియోలో పిజ్జా ఆర్డర్ చేస్తూ భలే హాస్యాన్ని పండించింది. పిజ్జా ఆర్డర్ చేయటంలో కామెడీ ఏంటి అంటారా? ఆమె తన గొంతుకతో కాదు ఆలియాలాగా మాట్లాడుతూ అవతలి వ్యక్తిని అవాక్కయ్యేలా చేసింది!

Alia Bhatt గొంతుతో పిజ్జా ఆర్డర్ చేసిన మిమిక్రీ ఆర్టిస్ట్! తరువాత ఏమైందంటే...

బాలీవుడ్ ని ఫాలో అయ్యే సొషల్ మీడియా యూజర్స్ కి బాగా తెలిసిన పేరు చాందిని. ఆమె మిమిక్రీ చేస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరీ ముఖ్యంగా, ఆలియా భట్, కంగనా రనౌత్ లాంటి వారి వాయిస్ ని అచ్చుగుద్దినట్టుగా దింపేస్తుంది. అయితే, ఆమె లెటెస్ట్ గా అప్ లోడ్ చేసిన ఓ సొషల్ మీడియా వీడియోలో పిజ్జా ఆర్డర్ చేస్తూ భలే హాస్యాన్ని పండించింది. పిజ్జా ఆర్డర్ చేయటంలో కామెడీ ఏంటి అంటారా? ఆమె తన గొంతుకతో కాదు ఆలియాలాగా మాట్లాడుతూ అవతలి వ్యక్తిని అవాక్కయ్యేలా చేసింది!


‘‘నీకు నచ్చిన ఏదో ఒక చోటి నుంచీ పిజ్జా ఆర్డర్ చేయాలి... కాకపోతే, ఆలియా భట్ గొంతుతో...’’ అనే ఛాలెంజ్ విసరుతారు వీడియో మొదట్లో. ఆ సవాలుని స్వీకరించిన మిమిక్రీ ఆర్టిస్ట్ చాందిని ఫోన్ అందుకుని ఆలియా భట్ కంఠం స్వరంతో మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆలియా శాఖాహారి అన్న విషయం తెలిసిందే కదా... అందుకే, చాందిని గ్లూటెన్ లేని వెజ్ పిజ్జా ఆర్డర్ చేస్తుంది. అంతే కాదు, తాను ఆలియానే అని నమ్మించేందుకు పక్కనున్న రణబీర్ తో మాట్లాడుతన్నట్టుగా కూడా ఆమె నటిస్తుంది. అతడ్ని తనకేం పిజ్జా కావాలో చెప్పమంటుంది! ఇదంతా వింటోన్న అవతలి వైపు వ్యక్తి మాటల్లో మనకు ఆశ్చర్యం స్పష్టంగా ధ్వనిస్తుంది! 


ఆలియా లాగే మాట్లాడుతూ పిజ్జా ఆర్డర్ చేసిన చాందినీని నెటిజన్స్ రకరకాల కామెంట్స్ తో మెచ్చుకుంటున్నారు. ఒకరు ‘‘పర్ఫెక్ట్ గా మాట్లాడావ్. నేను కళ్లు మూసుకుని నీ మాటలు వింటుంటే ఆలూ(ఆలియా)నే కనిపించింది!’’ అన్నారు. మరొకరు ‘‘ఆ అబ్బాయి తన జీవితాంతం ఈ రోజుని జ్ఞాపకం ఉంచుకుంటాడు’’ అంటూ పిజ్జా ఆర్డర్ తీసుకున్న అవతలి వ్యక్తిని ఉద్దేశించి అన్నారు. ఇక చాలా మంది నేరుగా ఆలియా భట్ నే ట్యాగ్ చేశారు తమ కామెంట్స్ లో. ఆమె కూడా ఈ ఫన్నీ వీడియోను చూస్తే బావుంటుందని వారి ఉద్దేశం... 



Updated Date - 2022-04-08T01:02:27+05:30 IST

Read more