సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌తోపాటు ఆ యాడ్‌లో నటించిన అక్షయ్ కుమార్.. మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్లు

ABN, First Publish Date - 2022-04-14T17:56:59+05:30

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ స్టార్ హీరో సాధారణంగా కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉంటుంటాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఈ స్టార్ హీరో సాధారణంగా కాంట్రవర్సీలకు ఆమడ దూరంలో ఉంటుంటాడు. అలాంటి తాజాగా ఈ యాక్టర్‌ని నెటిజన్లు మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు. దానికి కారణం అక్షయ్ ఓ పాన్ మసాలా యాడ్‌లో నటించడం. అందులో ఇంతకుముందు నుంచే స్టార్ హీరోలైన షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నారు. అయితే అలాంటి యాడ్స్‌లో వీరు నటించడంపై ఎంతోమంది ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో మరో స్టార్ అక్షయ్ అందులో నటించనుండడం విమర్శలకు కారణం అయ్యింది. అందుకే ఆయనపై రెచ్చిపోయి మీమ్స్ చేస్తున్నారు.


అయితే.. ఇందులో కొందరు ఫన్నీ‌గా చేయగా.. మరికొందరు మీమర్స్ ఘాటుగా మీమ్స్ రూపంలో విమర్శలు చేస్తున్నారు. అందులో ఓ నెటిజన్ అయితే ఈ యాడ్ చూసిన తర్వాత ఫ్యాన్స్ రియాక్షన్ ఇది అంటూ వీడియో షేర్ చేశాడు. అందులో.. ఓ అభిమాని అక్షయ్ జుట్టు పట్టుకొని లాగడం కనిపిస్తుంది. ఆ మీమ్స్‌పై మీరు ఓ లుక్కేయండి..



















Updated Date - 2022-04-14T17:56:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!