సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manushi Chhillar: స్టార్ హీరో చిత్రంలో ఛాన్స్

ABN, First Publish Date - 2022-11-27T23:03:35+05:30

మోడలింగ్‌ను కెరీర్‌గా ఆరంభించి అనంతరం హీరోయిన్‌గా మారిన అందాల భామ మానుషి చిల్లర్ (Manushi Chhillar). మిస్ వరల్డ్ టైటిల్‌ను 2017లో కైవసం చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోడలింగ్‌ను కెరీర్‌గా ఆరంభించి అనంతరం హీరోయిన్‌గా మారిన అందాల భామ మానుషి చిల్లర్ (Manushi Chhillar). మిస్ వరల్డ్ టైటిల్‌ను 2017లో కైవసం చేసుకుంది. ఈ మధ్యనే హీరోయిన్‌గా వెండితెరపైకి రంగప్రవేశం చేసింది. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj) లో సంయోగిత పాత్రతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికి ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. మానుషికి సంబంధించిన ఓ అప్‌డేట్ బాలీవుడ్ మీడియాలో షికార్లు కొడుతుంది. తాజాగా స్టార్ హీరో చిత్రంలో ఆమె అవకాశం దక్కించుకుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. 


బాలీవుడ్ బడా ప్రాజెక్టు ‘బడేమియా చోటేమియా’ (Bade Miyan Chote Miyan) సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్‌కు చోటుందని సమాచారం. ఒక్క నటిగా మానుషిని మేకర్స్ ఫైనలైజ్ చేశారట. ‘బడేమియా చోటేమియా’ లో  అక్షయ్ కుమార్ (Akshay Kumar), టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) హీరోలుగా నటిస్తున్నారు. టాప్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాసు, జాకీ భగ్నానీ మెగా బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 మొదట్లో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమా చిత్రీకరణను ఇండియాతో పాటు యూరప్, యూఏఈలో జరపనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఇక మానుషి కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్‌కు కూడా ఆమె ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ పాత్రను పోషించే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. 

Updated Date - 2022-11-27T23:03:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!