సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నెలకు రూ.10 లక్షల అద్దెకు ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్.. మరో జంట పెళ్లికి సిద్ధమవుతోందిగా..!

ABN, First Publish Date - 2022-04-22T19:58:26+05:30

ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పీటలు ఎక్కగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలికాలంలో బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పీటలు ఎక్కగా.. ఇటీవలే అంటే ఏప్రిల్ 14న క్రేజీ కపుల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో ఒకటయ్యారు. తాజాగా లవ్‌బర్డ్స్ ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి పెళ్లికి రెడీ అవుతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


రాహుల్, అతియా మధ్య గత కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వారి ప్రేమ విషయాన్ని బయటికి తెలియకుండా దాచడానికి ఈ లవ్‌బర్డ్స్ ఏ మాత్రం ప్రయత్నించలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా బహిరంగంగానే ఒకరిపై మరొకరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి మరొకరు హాజరయ్యారు. గత కొన్ని రోజుల క్రితం ఈ జంట ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వచ్చింది. సౌతిండియన్ స్టైల్‌లో వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ జంట కలిసి ఉండటానికి ఓ అపార్ట్‌మెంట్‌ని అద్దెకి తీసుకున్నారని న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.


ముంబైలోని కార్టర్ రోడ్‌లో ఉన్న ఓ బిల్డింగ్‌లోని ఎనిమిదవ ఫ్లోర్‌లో 4 బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌ని అద్దెకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ అపార్ట్‌‌మెంట్ గురించే బాలీవుడ్ జనాలు అబ్బురంగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఆ అపార్ట్‌మెంట్ అద్దె నెలకి అక్షరాలా రూ.10 లక్షలట. ఆ లగ్జరియస్ అపార్ట్‌మెంట్ నుంచి చూస్తే సముద్రం ఎంతో అందంగా కనిపిస్తుందని వినికిడి. అందుకే అంత రెంట్ పెట్టడానికి కూడా ఈ జంట వెనకట్లేదని తెలుస్తోంది.

Updated Date - 2022-04-22T19:58:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!