సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2022-11-07T13:51:04+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ (OTT) ల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీ (OTT) ల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. నవంబర్ 6న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


సిక్స్ (Six)

వ్యాపారవేత్త చండీ దాస్ కుటుంబానికి చెందిన 6 గురు కుటుంబ సభ్యులు వరుసగా మరణిస్తారు. వారి మరణం వార్తాపత్రికలు,  టీవీల్లో సంచలనంగా మారుతుంది. హత్య లేక ఆత్మహత్య అనే సందేహం అందరిలో కలుగుతుంది. దాంతో అధికార యంత్రాంగం హై అలర్ట్‌ అవుతుంది. ఈ మరణాల అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఎం విచారణ బాధ్యతను పోలీస్ ఆఫీసర్ అనుభవ్ సారంగికి అప్పగిస్తాడు. అతని విచారణ కొన్ని భయంకరమైన విషయాలు బయటికి వచ్చి.. అతనితో పాటు అతని కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఆ ప్రమాదాల నుంచి ఆ అధికారి ఎలా బయటపడ్డాడనేది ఈ ‘సిక్స్’ కథాంశం. 


ఈ వెబ్‌సిరీస్‌లో బిరంచి నాయక్, రాగిణి సూత్రధర్, బిదుస్మిత, బాదల్ మొహంతి, ఉదిత్ గురు, కైలాష్ పాణిగ్రాహి, ప్రశాంత్ పాత్ర, శతాబ్ది సూర్యస్నత, బిభుదేందు కర్త్, సాయి నటించిన సిక్స్ జ్యోతి, బులు, కెడి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఓరియా వెబ్‌‌సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అదర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.



Updated Date - 2022-11-07T13:51:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!