తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-10-03T14:02:18+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. అక్టోబర్ 2న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga)

పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన రోమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంగ రంగ వైభవంగా’. సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసిన గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 2న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


ఫరేవర్ క్వీన్స్ (Forever Queens)

ఫరేవర్ క్వీన్స్.. ఈ సిరీస్ మెక్సికన్ వెబ్‌సిరీస్. నలుగురు సాధారణ మహిళలు కలిసి ఓ సాంగ్‌ని రికార్డు చేసి మంచి పాపులారిటీ సాధిస్తారు. అనంతరం వారికి ఎదురైన సమస్యల సమాహారమే ఈ వెబ్‌సిరీస్. లూసియా మెండెజ్, లారా జపాటా, సిల్వియా పాస్వెల్, లోరెనా హెర్రెరా ముఖ్య పాత్రలను పొషించారు. ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - 2022-10-03T14:02:18+05:30 IST

Read more