తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-12-01T14:23:34+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా నవంబర్ 30న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


ఆమ్‌స్టర్‌డామ్ (Amsterdam)

ఆమ్‌స్టర్‌డామ్ అనేది 2022 పీరియడ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రానికి డేవిడ్ ఓ.రస్సెల్ రచన, దర్శకత్వం అందించాడు. ఈ మూవీలో క్రిస్ రాక్, అన్యా టేలర్-జాయ్, జో సల్దానా, మైక్ మైయర్స్, మైఖేల్ షానన్, తిమోతీ ఒలిఫాంట్, ఆండ్రియా రైస్‌బరో, టేలర్ స్విఫ్ట్, మథియాస్ స్కోనాండర్స్ కీలకపాత్రలు పోషించారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో అక్టోబర్ 7, 2022న 20th సెంచరీ స్టూడియోస్ విడుదల చేసింది. ఒక డాక్టర్, ఒక నర్సు, ఒక లాయర్ ముగ్గురు మంచి స్నేహితులు. వారు అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దాని నుంచి బయట పడటానికి వారు చేసే ప్రయత్నాలే ఆమ్‌స్టర్‌డామ్. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఐట్యూన్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


మై నేమ్ ఈజ్ వెందెట్ట (My Name Is Vendetta)

సోఫియా ఓ టీనేజర్. ఆమె హాకీ అంటే చాలా ఇష్టం. అయితే ఆమె తన తండ్రి శాంటోని రహస్యంగా ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దాని వల్ల వారి జీవితాల్లో దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటుంది. అనంతరం వారి జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ‘మై నేమ్ ఈజ్ వెందెట్ట’. ఈ ఇటాలియన్ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

The Creature Cases Season 2 - ఇంగ్లిష్

Take Your Pills: Xanax - ఇంగ్లిష్

Snack vs Chef - ఇంగ్లిష్

Christmas Full of Grace - పోర్చుగీస్

A Man of Action - స్పానిష్


అమెజాన్ ఫ్రైమ్ (Amazon Prime)

The Infernal Machine - ఇంగ్లిష్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Willow - ఇంగ్లిష్

Updated Date - 2022-12-01T14:23:34+05:30 IST

Read more