తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-12-08T18:09:17+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. డిసెంబర్ 7న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


ది మ్యారేజ్ యాప్ (The Marriage App)

మెడీకి సెబాస్టియన్ డి కారో (క్లాడియా) దర్శకత్వం వహించిన స్పానిష్ సినిమా ‘ది మ్యారేజ్ యాప్’. సినిమాలో లూయిసానా లోపిలాటో, జువాన్ మినుజిన్ ప్రధాన పాత్రలు పోషించగా.. క్రిస్టినా కాస్టానో, ఆండ్రియా రింకన్, జూలియన్ లూసెరో, శాంటియాగో గోబెర్నోరి, విన్సెంట్ ఆర్చెయిన్, ఐలెన్ మలిసాని సహాయక పాత్రలు పోషించారు. పెళ్లి జీవితానికి కొత్త అర్థం చెప్పిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
బర్నింగ్ పేషెన్స్ (Burning Patience)

బర్నింగ్ పేషెన్స్ అనేది స్పానిష్ మూవీ. ఆంటోనియో స్కార్మెటా రాసిన బర్నింగ్ పేషెన్స్ అనే పుస్తక ఆధారంగా తెరకెక్కించారు. సినిమా రన్ టైమ్ గంటా ముప్పై నిమిషాలు. ఇద్దరు వర్ధమాన ప్రేమికులు, మారియో, బీట్రిజ్‌ కథే ఈ చిత్రం. వారి మధ్య రిలేషన్‌షిప్ అన్నింటికి భిన్నంగా ఉంటుంది. దాని వల్ల వారికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ బర్నింగ్ పేషెన్స్. ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Too Hot to Handle Season 4 - ఇంగ్లిష్

Smiley - స్పానిష్

The Most Beautiful Flower - స్పానిష్


మూబీ (Mubi)

Blank Narcissus: Passion of the Swamp - ఇంగ్లిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Aditi Mittal Bade Bhaiya - హిందీ

Updated Date - 2022-12-08T18:09:17+05:30 IST

Read more