తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ABN , First Publish Date - 2022-10-04T13:15:14+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల.. తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల.. తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. అక్టోబర్ 3న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
డౌన్టన్ అబ్బే: ఎ న్యూ ఎరా (Downton Abbey: A New Era)
డౌన్టన్ అబ్బే: ఎ న్యూ ఎరా అనేది 2022 హిస్టారికల్ డ్రామా మూవీ. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ డౌన్టన్ అబ్బేకి ఇది సీక్వెల్. ఇంతకుముందు ఇదే పేరుతో టెలివిజన్ షోలు ప్రసారమయ్యాయి. వాటి ఆధారంగా చేసుకుని ఆ టీవీ షోలను రాసిన రచయిత జూలియన్ ఫెలోస్ ఈ రెండు సినిమాల కథలను రాశారు. మొదటి చిత్రానికి మైఖేల్ ఇంగ్లర్ దర్శకత్వం వహించగా.. సీక్వెల్‌కి సైమన్ కర్టిస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీని యునైటెడ్ కింగ్డమ్లో 29 ఏప్రిల్ 2022న యూనివర్సల్ పిక్చర్స్ విడుదల చేసింది. అలాగే.. మే 20న యునైటెడ్ స్టేట్స్లో ఫోకస్ ఫీచర్స్ విడుదల చేసింది. ఈ చిత్రం కూడా దాని మొదటి భాగంలాగే పాజిటివ్ రివ్యూలను అందుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, బుక్ మై షోలో స్ట్రీమింగ్ అవుతోంది.
చిప్ అండ్ పొటాటో: చిప్స్ హాలీవుడ్ (Chip and Potato: Chip's Holiday)
చిప్, ఆమె కుటుంబం, ఆమె బెస్ట్ ఫ్రెండ్ పొటాటో సెలవులను ఎంజాయ్ చేయడానికి సొంత టౌన్ హ్యాపీటన్ నుంచి లా ఇస్లా హప్పిటిటాకు ప్రయాణిస్తుంటారు. ఈ తరుణంలో వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని చిప్, పొటాటో కలిసి ఎలా పరిష్కారించారనేది చిత్ర కథాంశం. నెట్‌ఫ్లిక్స్ ఓరిజినల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

