తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-09-24T14:38:51+05:30 IST

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. సెప్టెంబర్ 23న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


బాబ్లీ బౌన్సర్ (Babli Bouncer)

మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన 2022 హిందీ భాషా డ్రామా చిత్రం ‘బాబ్లీ బౌన్సర్’. తమన్నా ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రాన్ని అమిత్ జోషి, ఆరాధనా దేబ్‌నాథ్, మధుర్ భండార్కర్ రచించారు. పల్లెటూరి యువతి బౌన్సర్‌గా మారి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది అనేది ఈ చిత్ర కథాంశం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


ఫస్ట్ డే ఫస్ట్ షో (First Day First Show)

శీను 18 ఏళ్ల యువకుడు పవన్ కల్యాణ్ పెద్ద అభిమాని. అతని క్రష్ లయ తన ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి టిక్కెట్లు ఇప్పించమని అడుగుతుంది. అతనితో కలిసి షో చూస్తానని హామీ ఇస్తుంది. ఆ టిక్కట్ల కోసం ఆ యువకుడు పడ్డ పట్లే ఈ చిత్ర ఇతివృత్తం. ‘జాతిరత్నాలు’ అనుదీప్ రచయితగా వ్యవహారించిన ఈ మూవీకి వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంచెట్టి దర్శకులు. మహేశ్ ఆచంట, కుందన్ అలెక్స్‌డ్, సంచిత బసు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Jamtara Season 2 - హిందీ

Athena - ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, ఫ్రెంచ్

A Jazzman's Blues - ఇంగ్లిష్

The Girls at the Back - స్పానిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Apache Stays Apache - జర్మన్

September Mornings Season 2 - పోర్చుగీస్


బుక్ మై షో (Book My Show)

Beckman - ఇంగ్లిష్

Stardust - ఇంగ్లిష్

Batman: The Long Halloween Deluxe Edition - ఇంగ్లిష్

Jurassic Hunt - ఇంగ్లిష్


ఆహా వీడియో (Aha Video)

Diary - డైరీ 


జీ5 (Zee5)

Kalapuram - తెలుగు

Atithi Bhooto Bhava - హిందీ

Bhavai - హిందీ

Sohreyan Da Pind Aa Gaya - పంజాబీ


సన్ నెక్ట్స్ (Sun NXT)

Thiruchitrambalam - తమిళం, తెలుగు


అదర్ (Other)

S.H.O Sher Singh - పంజాబీ


వూట్ (Voot)

Sugarless - కన్నడ


లయన్స్ గేట్ (Lionsgate Play)

Blindspotting - ఇంగ్లీష్

Updated Date - 2022-09-24T14:38:51+05:30 IST

Read more