తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2022-09-18T14:27:36+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోరింగ్‌గా ఫీల్ అవుతున్నా సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా సెప్టెంబర్ 16న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan)

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించగా.. సునీల్‌, పూర్ణ, కబీర్‌ సింగ్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గత నెల విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ని మూటగట్టుకుంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.


కిరోసిన్ (Kerosene)

దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసి, కిరోసిన్ పోసి తగులబెట్టిన బాధితుల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, వైభవ్‌ అనే పోలీసు అధికారికి అదే పద్ధతి ప్రకారం మరికొన్ని కేసులు ఎదురవుతాయి. ఆ పోలీసు కేసుని ఎలా పరిష్కారించాడనేది ‘కిరోసిన్’ సినిమా కథ. ధ్రువ, ప్రితిసుందర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Jogi - తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్

I Used to Be Famous - ఇంగ్లిష్

Do Revenge - ఇంగ్లిష్

Drifting Home - ఇంగ్లిష్

Mija - ఇంగ్లిష్

Gymnastics Academy: A Second Chance - ఇంగ్లిష్

The Brave Ones - ఇంగ్లిష్

Fate: The Winx Saga Season 2 - ఇంగ్లిష్

Finding Hubby 2 - ఇంగ్లిష్

Mirror Mirror - ఇంగ్లిష్

Skandal! Bringing Down Wirecard - ఇంగ్లిష్

Mat Kilau - మలై

Santo - స్పానిష్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

13:14: The Challenge of Helping - స్పానిష్

X - ఇంగ్లిష్

The Grand Tour Season 5 - ఇంగ్లిష్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Dahan - తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ


బుక్ మై షో (Book My Show)

The Chelsea Detective - ఇంగ్లిష్



Updated Date - 2022-09-18T14:27:36+05:30 IST