తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ABN , First Publish Date - 2022-10-30T13:44:24+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. అక్టోబర్ 30న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
ది సెటప్ 2 (The Set Up 2)
ది సెటప్ 2 అనేది 2022 నైజీరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇది 2019లో హిట్ చిత్రం విడుదలైన ది సెటప్‌కి సీక్వెల్. ఇంక్‌బ్లాట్ ప్రొడక్షన్స్, ఫిల్మ్ వన్ ఎంటర్‌టైన్‌మెంట్, అనకల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి మొదటి భాగానికి దర్శకత్వం వహించిన నియీ అకిన్‌మోలయన్‌కు బదులుగా నాజ్ ఒనుజో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అడెసువా ఎటోమి, కెహిండే బంకోలే, నాన్సీ ఇసిమ్, జిమ్ ఐకే, టీనా మ్బా, ఉజోర్ అరుక్వే, కేట్ హెన్‌షా, బ్లోసమ్ చుక్వుజెక్వు, స్టాన్ న్జే, లోటా చుక్వు నటించారు. ఈ చిత్రం 12 ఆగస్టు 2022న నైజీరియాలో విడుదలై విజయవంతమైంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
రూట్ 10 (Route 10)
మరియమ్, నాజర్ తోబుట్టువులు అబుదాబిలో జరగబోయే తమ తండ్రి పెళ్లికి హాజరయ్యేందుకు రియాద్ నుంచి వెళ్లేందుకు సిద్ధం అవుతారు. కానీ.. వారు వెళ్లాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. అయినా నిరుత్సాహపడకుండా కారులో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఏడారిలో సాగే వారి ప్రయాణంలో వారికి ఓ అపరిచితుడి వల్ల సమస్యలు ఎదురవుతాయి. అతని నుంచి తప్పించుకోడానికి వారిద్దరి చేసే ప్రయత్నమే ఈ చిత్ర కథాంశం. ఈ అరబిక్ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
Deadwind Season 3 - ఇంగ్లిష్, ఫిన్నిష్, జర్మన్

