తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-11-23T14:05:05+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా నవంబర్ 22న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


ఈఫిల్ (Eiffel)

ఈఫిల్ అనేది ఫ్రెంచ్ రొమాంటిక్ డ్రామా చిత్రం. ఈ కథని కరోలిన్ బొంగ్రాండ్ రాయగా.. మార్టిన్ బోర్‌బౌలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రోమైన్ డ్యూరిస్ గుస్టావ్, ఎమ్మా మాకీ, అడ్రియన్ బోర్గెస్ ముఖ్య పాత్రలు పోషించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


బస్కో నోవియా(Busco novia)

రెంజో కొల్లాజోస్ అనే వ్యక్తి వార్తాపత్రికలో రాజకీయ వార్తలు రాసి గుర్తింపు పొందుతారు. ఓ రోజు ఆ పత్రిక ఎడిటర్ రెంజోని యువతకి నచ్చేలా ఓ వెబ్ సైట్ నిర్వహించామని చెబుతాడు. అందులో తన మాజీ ప్రియురాలి గురించి రాస్తాడు. దాని వల్ల అతనికి ఎదురైన సంఘటనల సమహారమే ఈ చిత్రం. ఈ స్పానిష్ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Trevor Noah: I Wish You Would - ఇంగ్లిష్

Our Universe - ఇంగ్లిష్


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar)

Second Marriage - హిందీ

3rd Stanza - హిందీ

Saga - ఇంగ్లిష్


సోనీ లివ్ (Sony LIV)

Science’s Greatest Mysteries - ఇంగ్లిష్

Updated Date - 2022-11-23T14:05:05+05:30 IST

Read more