తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-11-02T13:41:23+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. నవంబర్ 1న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


ద్విముఖ (Dwimukha)

నకుల్‌ తన ఆఫీసులో ప్రేమించిన విభాను పెళ్లి చేసుకున్నాడు. విభాకు ఓ రహస్యం ఉంటుంది. అది నకుల్‌కి తెలియకుండా దాచేస్తుంది. ఈ తరుణంలోనే విభా కనిపించకుండా పోతుంది. దాంతో పోలీసులు నకుల్‌ని ప్రధానంగా అనుమానిస్తారు. దాంతో.. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లోకి నకుల్‌ వెళతాడు. ఆ ప్రయాణంలో అతను ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలను తెలుసుకుంటాడు. ఎవరు నిజాయతీపరులు. ఎవరు కాదు? ఎవరు మంచివారు, ఎవరు కాదు? ప్రతి ఒక్కరికి ఇతరులకి తెలియని మరో ముఖం ఉంటుందని తెలుసుకుంటాడు. ఎంతో కూల్‌గా సాగిపోతున్న అతనికి ఎదురైన సమస్యల సమాహారమే 'ద్విముఖ' కథాంశం. ఈ కన్నడ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అదర్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


ది టేకోవర్‌ (The Takeover)

కొందరి వ్యక్తుల గోప్యతని బయటపెట్టడానికి ప్రయత్నించినందుకు ఒక ఎథికల్ హ్యాకర్ అయిన హోలీ మే బ్రూడ్‌ని వారు బెదిరిస్తారు. ఆమె పోలీసుల నుంచి తప్పించుకుంటూ క్రిమినల్స్ ని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. ఈ ప్రయాణంలో ఆమెకి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ 'ది టేకోవర్‌'. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Gabby's Dollhouse Season 6 - ఇంగ్లిష్

To Russia With Love - టాగలాగ్‌

Young Royals Season 2 - స్పానిష్‌, స్వీడిష్‌, ఇంగ్లిష్, ఇటాలియన్‌

Updated Date - 2022-11-02T13:41:23+05:30 IST

Read more