తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-12-07T13:34:47+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా డిసెంబర్ 6న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


డెలివరీ బై క్రిస్మస్ (Delivery by Christmas)

ఓ డెలివరీ గర్ల్‌పై కోపంతో ఆమె సహోద్యోగి ఆమె డెలివరీ చేయాల్సిన ఐటమ్స్‌ని ధ్వంసం చేస్తుంది. ఈ తరుణంలో ఓ కొరియర్, ఆమెకి సహాయం చేసే ఓ కస్టమర్.. ఆ డెలివరీలు ఇవ్వాల్సిన వారికి  క్రిస్మస్ బహుమతులను ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ తరుణంలో వారికి ఎదురైన సంఘటనల సమాహారమే ‘డెలివరీ బై క్రిస్మస్’. తిరిగి ఇవ్వడానికి పోటీ పడాలి. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


బాస్ బేబీ: క్రిస్మస్ బోనస్ (The Boss Baby: Christmas Bonus)

బాస్ బేబీ అనుకోకుండా శాంటాకి సంబంధించిన దేవదూతలతో రీ ప్లేస్ అవాల్సి వస్తుంది. దీంతో ఉత్తర ధ్రువంలో చిక్కుకుని ఇబ్బందులు పడతాడు. ఈ తరుణంలో అతని ఎదురైన సంఘటనలా సమాహారమే ‘బాస్ బేబీ: క్రిస్మస్ బోనస్’ చిత్రం. ఈ యానిమేటేడ్ చిత్రంలో జేపీ కార్లియాక్, పియర్స్ గాగ్నోన్, జార్జ్ లోపెజ్ ప్రధాన పాత్రలకు వాయిస్ ఇచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Sebastian Maniscalco: Is it Me? - ఇంగ్లిష్


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

His Dark Materials Season 3 - ఇంగ్లిష్

Updated Date - 2022-12-07T13:34:47+05:30 IST

Read more