తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-12-02T14:12:46+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి..

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. డిసెంబర్ 1న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


రిపీట్ (Repeat)

సుబ్రమణ్యం (అచ్యుత్ కుమార్) అనే నవలా రచయిత తన ఊహాత్మక కథలలోని పాత్రలు ప్రాణం పోసుకోవడంతో పోలీసుల సహాయం కోరతాడు. పోలీసులు అతనిని నమ్మరు. కానీ నవలా రచయిత కథను రాసిన విధంగానే డీజీపీ ఆశా ప్రమోద్ (మధుబాల) కుమార్తె అపహరణకు గురవుతుంది. డీజీపీ కూతురు మిస్సింగ్ వెనుక సుబ్రమణ్యం హస్తం ఉందని పోలీసులు భావిస్తారు. కానీ వారు అవసరమైన పురోగతిని పొందలేకపోయారు. అందుకే ఒక రహస్య పోలీసు విక్రమ్ కుమార్ (నవీన్ చంద్ర)కి ఆ పనిని అప్పగిస్తారు. అతను ఆ కేసును పరిష్కారించే క్రమంలో అతనికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ ‘రిపీట్’. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏ కైండ్ హార్టెడ్ క్రిస్టమస్ (A Kindhearted Christmas)

అమీ (జెన్నీ గార్త్) అనే మహిళ చిన్నపట్టణ టూరిజం కంపెనీకి యజమాని. ఆమె భర్త చనిపోవడంతో కంపెనీని రన్ చేయడం ఆమెకి కష్టమైపోతుంది. ఆ కంపెనీని సక్సెస్ బాటలో పెట్టడానికి ఆమె చేసే ప్రయత్నమే ఏ కైండ్ హార్టెడ్ క్రిస్టమస్. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

Qala - హిందీ, ఇంగ్లిష్

Christmas Time Is Here - ఇంగ్లిష్

Blippi Wonders - ఇంగ్లిష్

A Christmas Miracle for Daisy - ఇంగ్లిష్

Spilt Gravy: Ke Mana Tumpahnya Kuah - ఇంగ్లిష్

Dead End - పొలిష్

The Masked Scammer - ఫ్రెంచ్

Love Destiny: The Movie - థాయ్


డిస్ని ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar)

Mind Over Murder - ఇంగ్లిష్

Crazy Love - కొరియన్


అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)

Jujutsu Kaisen 0 - జపనీస్, థాయ్

Ivanna - ఇండోనేషియన్


షామారో మీ (Shemaroo Me)

Room No.420 - తెలుగు

Updated Date - 2022-12-02T14:12:46+05:30 IST

Read more