సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2022-10-02T14:11:43+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు.


కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన కొన్ని సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మరి కొన్నైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


చోర్ బజార్ (Chor Bazaar)

ఆకాష్ పూరి, గెహ్నా సిప్పీ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ చిత్రం చోర్ బజార్. బి.జీవన్ రెడ్డి దర్శకత్వం వహించగా.. ఐవీ ప్రొడక్షన్ నిర్మించింది. 24 జూన్ 2022న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో.. సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


కిరిక్ శంకర్ (Kirik Shankar)

కిరిక్ శంకర్ అనేది 2022లో విడుదలైన కన్నడ రోమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఆర్.అనంత రాజు దర్శకత్వం వహించిన.. ఈ చిత్రాన్ని ఎమ్‌ఎన్‌కే మూవీస్ నిర్మించింది. 27 మే 2022న విడుదలైన ఈ చిత్రంలో లూజ్ మాడ యోగి, అద్విక ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Blade - ఇంగ్లిష్

Blade II - ఇంగ్లిష్

Blade: Trinity - ఇంగ్లిష్


Amazon Prime (అమెజాన్ ప్రైమ్)

Hunt - ఇంగ్లిష్

Nope - ఇంగ్లిష్


జీ5 (Zee5)

The Gandhi Murder - ఇంగ్లిష్


మనోరమ మ్యాక్స్ (Manorama MAX)

Solomante Theneechakal - మలయాళం


అదర్ (Other)

Shareek 2 - పంజాబీ


ప్లానెట్ మరాఠీ ఓటీటీ (Planet Marathi OTT)

Sahela Re - మరాఠీ


ఎమ్ ఎక్స్ ప్లేయర్ (MX Player)

Gamers Den - హిందీ, ఇంగ్లిష్





Updated Date - 2022-10-02T14:11:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!