తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN , First Publish Date - 2022-11-15T13:45:02+05:30 IST

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి...

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. ఈ తరుణంలో.. నవంబర్ 14న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..


స్టట్జ్ (Stutz)

ఫిల్ స్టట్జ్ ప్రపంచంలోని ప్రముఖ మానసిక వైద్యులలో ఒకరు. అతను 40 ఏళ్లుగా ఈ రంగంలో ఉంటూ.. ప్రపంచ స్థాయి క్రియేటివ్‌లు, వ్యాపార వేత్తలు వంటి ఎంతోమంది రోగులకు సహాయం చేశాడు. అతని స్నేహితుడు, రోగి జోనా హిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్టట్జ్ జీవితం గురించి తెలుపుతుంది. అతని ప్రయాణం ప్రేక్షకులను ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


సుమీ (Sumi)

సుమీ అనేది 2022లో విడుదలైన మరాఠీ చలన చిత్రం. అమోల్ గోలే దర్శకత్వం వహించగా.. గోల్డెన్ మౌస్ ప్రొడక్షన్స్‌తో కలిసి హర్షల్ కామత్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది. 2022లో ఈ చిత్రం రెండు ప్రతిష్టాత్మక విభాగాల్లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు, ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లానెట్ మరాఠీలో స్ట్రీమింగ్ అవుతోంది.


నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Teletubbies - ఇంగ్లిష్


షామారో మీ (Shamaaro me)

Yamraj Calling Season 2 - గుజరాతీ

Updated Date - 2022-11-15T13:45:02+05:30 IST

Read more