సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger in Controversy: ఆ పాటలో రేప్ సీన్ డైలాగ్ పెట్టడం ఏంటంటూ..

ABN, First Publish Date - 2022-08-18T18:27:35+05:30

హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి పాటలు, ఫైట్ల వరకూ చాలా డిఫరెంట్‌గా తీసే దర్శకుడు ఎవరంటే మొదట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి పాటలు, ఫైట్ల వరకూ చాలా డిఫరెంట్‌గా తీసే దర్శకుడు ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). అప్పటి వరకూ ఒకలా ఉన్న నటుడిని తన సినిమాతో మరోలా మార్చేస్తాడు. అలాంటి టాలెంటెడ్ దర్శకుడు తాజా డైరెక్షన్ చేసిన మూవీ ‘లైగర్(Liger)’. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే (Ananya Panday) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రంలో రమ్యకృష్ణ, మైక్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.


ఈ సినిమా నుంచి ఆఫట్ (Aafat) అనే సాంగ్ విడుదలైంది. ఆ పాటలో బాలీవుడ్‌ పాపులర్ సినిమా చెందిన రేప్ సీన్ డైలాగులు వినిపిస్తాయి. అది పలువురు నెటిజన్ల కోపానికి కారణమైంది. ‘ఆ పాటలో పాత సినిమాలోని రేప్ సన్నివేశం డైలాగ్‌ని ఎందుకు ఉపయోగించారు’ ఒకరు.. ‘మహిళ ద్వేషి అయిన వ్యక్తి నుంచి మనం ఎలాంటి సినిమాని ఆశించవచ్చు’ అని మరొకరు.. ‘ఓ మోడ్రన్ సాంగ్‌లో రేప్ సీన్ డైలాగ్ పెట్టాలనే ఆలోచన రావడం భయకరంగా అనిపిస్తోంది’ అని ఇంకొకరు.. మరొకరైతే.. ‘అనవసరమైన కారణాలకు బాలీవుడ్ సినిమాలను బాయ్‌కాట్ చేసినవాళ్లు ఈ సినిమాని నిజంగా బాయ్‌కాట్ చేయరా’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు. కాగా.. ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.







Updated Date - 2022-08-18T18:27:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!