సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అన్న Birth Day Bash... ప్రియురాలితో కలసి తమ్ముడి హల్‌చల్!

ABN, First Publish Date - 2022-02-27T22:10:54+05:30

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ బర్త్ డే బాష్ ఫిబ్రవరి 25న జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ బర్త్ డే బాష్ ఫిబ్రవరి 25న జరిగింది. ఈ వేడుకలో అనేక మంది బీ టౌన్ సెలబ్రెటీలు సందడి చేశారు. తాజాగా షాహిద్ తన పుట్టిన రోజు పార్టీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పార్టీకి షాహిద్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్, అతడి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అనన్య పాండే కూడా హాజరయ్యారు. ఇషాన్,అనన్య మాత్రమే కాకుండా మరో రూమర్డ్ కపుల్ కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా కూడా ఈ వేడుకలో సందడి చేశారు. తన బర్త్ డే పార్టీకి సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను షాహిద్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియో కింద క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘బెస్ట్ టైమ్స్’ అని రాశాడు.

 

ఇక అనన్య పాండే విషయానికి వస్తే... ‘గెహ్రాయియా’లో నటించింది స్లిమ్ అండ్ సెక్సీ బ్యూటీ. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది కీలక పాత్రలు పోషించారు. అనన్య టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’లో కనిపించనుంది. మరో వైపు, అనన్య బాయ్‌ఫ్రెండ్‌గా బాలీవుడ్‌లో ప్రచారం అవుతోన్న ఇషాన్ ఖట్టర్ ‘ఫోన్ బూత్’ సినిమాలో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్, సిద్దాంత్ చతుర్వేది ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Updated Date - 2022-02-27T22:10:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!