సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్‌లో కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో Karan Johar..

ABN, First Publish Date - 2022-06-20T00:41:26+05:30

బాలీవుడ్‌లో పలు సినిమాలు నిర్మించి సొంతంగా ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి కరణ్ జోహార్ (Karan Johar). డైరెక్టర్, హోస్ట్‌ పాత్రలను కూడా నిర్వర్తిస్తుంటాడు. తాజాగా ఈ ఫిల్మ్ మేకర్ అనుకోని కారణాల వల్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో పలు సినిమాలు నిర్మించి ఫేమ్ సంపాదించుకున్న వ్యక్తి కరణ్ జోహార్ (Karan Johar). డైరెక్టర్, హోస్ట్‌ పాత్రలను కూడా నిర్వర్తిస్తుంటారు. తాజాగా ఈ ఫిల్మ్ మేకర్ అనుకోని కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ పార్టీకి అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో కొంత మందికి కరోనా సోకింది. దీంతో అందరు ఆయన వైపే వేళ్లెత్తి చూపారు. తాజాగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్ పేరు ఉందని తెలియడంతో బాలీవుడ్‌లో కలకలం రేగింది.     


కొన్ని రోజుల క్రితమే పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ హత్య లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ పనేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భాగంగా పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేశ్ కాంబ్లే (Siddesh Kamble) కూడా ఉన్నారు. సిద్ధేశ్‌ను పోలీసులు విచారణ జరపగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట. రూ. 5కోట్లకు పైగా ఆయన నుంచి రాబట్టాలని ప్రణాళికలు రచించారట. ప్రస్తుతం ఆయన వెల్లడించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు ఈ ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి. ఫలితంగా బాలీవుడ్ కండల వీరుడికి పోలీసులు భద్రతను పెంచిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-06-20T00:41:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!