సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akshay Kumar కు ఊహించని షాక్.. Samrat Prithviraj సినిమాపై కువైట్, ఒమన్, ఖతర్ దేశాల్లో నిషేధం..!

ABN, First Publish Date - 2022-06-02T22:44:40+05:30

యాక్షన్, కామెడీ‌తో సహా అన్ని రకాల జోనర్ సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). శరవేగంగా సినిమాలు చేస్తాడని ఆయనకు పేరుంది. అక్షయ్ తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాక్షన్, కామెడీ‌తో సహా అన్ని రకాల జోనర్ సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). శరవేగంగా సినిమాలు చేస్తాడని ఆయనకు పేరుంది. అక్షయ్ తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). మిస్ యూనివర్స్-2017 విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో జూన్ 3న హిందీ, తెలుగు, తమిళ్‌లో  విడుదల కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు అక్షయ్‌కు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే..


‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాపై కువైట్, ఒమన్, ఖతర్ దేశాల్లో నిషేధం విధించారు. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. మహమ్మద్ ఘోరీ దండయాత్రల నుంచి పృథ్వీరాజ్ భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాడనేది ఈ మూవీలో చూపించనున్నారు. కానీ, ఈ చిత్రంపై పలు దేశాల్లో నిషేధం విధించడంతో నెటిజన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సామాట్ర్ పృథ్వీరాజ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమాపై కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు నిషేధం విధించడం దురదృష్టకరం. సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది’’అని ఓ బాలీవుడ్ విశ్లేషకుడు తెలిపారు.



Updated Date - 2022-06-02T22:44:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!