KRK Comments on Bollywood: నన్ను మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చేద్దామనుకుంటున్నారా?.. జ్ఞాపకశక్తిని కోల్పోయానంటూ..

ABN , First Publish Date - 2022-10-03T16:23:17+05:30 IST

సినీ విమర్శకుడిని అంటూ తనకి తానే చెప్పుకునే నటుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan). గత నెలలో ఈ క్రిటిక్‌ని అరెస్ట్ చేసినప్పటి నుంచి బాలీవుడ్..

KRK Comments on Bollywood: నన్ను మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చేద్దామనుకుంటున్నారా?.. జ్ఞాపకశక్తిని కోల్పోయానంటూ..

సినీ విమర్శకుడిని అంటూ తనకి తానే చెప్పుకునే నటుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan). గత నెలలో ఈ క్రిటిక్‌ని అరెస్ట్ చేసినప్పటి నుంచి బాలీవుడ్ తన పట్ల ఘోరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూనే ఉన్నాడు. దివంగత ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌పై గతంలో చేసిన ప్రకటనల కారణంగా.. గత నెలలో ఈ నటుడిని ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి  తీసుకున్నారు. అనంతరం పది రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. కానీ అతను జైలులో చాలా కష్టంగా గడిపానని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో ప్రవర్తించినట్లుగానే తనతోనూ బాలీవుడ్ జనాలు బిహేవ్ చేశారని ఆరోపించారు.


కరోనా మహమ్మారి సమయంలో బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మరణించిన విషయం తెలిసందే. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. అందులో చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఇన్‌వాల్వ్ అయ్యి ఉన్నారని ప్రచారం జరిగింది. సుశాంత్‌తో తన పరిస్థితిని పోల్చుతూ కేఆర్‌కే తాజాగా ఓ ట్వీట్‌ పెట్టాడు.అందులో.. ‘నేను జైలులో ఉన్న పది రోజులు ఏం తినకుండా ఉన్నాను. అందుకే 20% జ్ఞాపకశక్తిని కోల్పోయాను. నేను నా మెమొరీని పొందే అవకాశం లేకపోగా.. భవిష్యత్తులో నేను మరింత కోల్పోవచ్చని వైద్యులు చెబుతున్నారు. నేను చనిపోతే దానికి కారణం బాలీవుడ్ జనాలే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ని ఎలా చేశారో.. నన్ను అలాగే చేశారని అందరూ తెలుసుకోవాలి’ అని రాసుకొచ్చాడు.


మరో ట్వీట్‌లో.. ‘నేను ఎక్కువ వీడియోలు ఎందుకు చేయడం లేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు?. ఎందుకంటే నాకు చాలా విషయాలు గుర్తు లేవు. నేను రికార్డింగ్ చేస్తున్నప్పుడు నా తర్వాతి లైన్ కూడా సరిగ్గా గుర్తుకు రావడం లేదు. అంటే కొంతమంది బాలీవుడ్ వ్యక్తులు నన్ను ఆపడంలో విజయం సాధించారని అర్థం. నేను సమీక్షలను ఆపి వేయడానికి ప్రధాన కారణం అదే’ అని రాసుకొచ్చాడు.

Updated Date - 2022-10-03T16:23:17+05:30 IST

Read more