సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rashmika Mandanna: రష్మిక మందన్నాకి అంత సీన్ లేదంటున్న కేఆర్‌కే

ABN, First Publish Date - 2022-12-28T11:43:45+05:30

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న సౌత్ ఇండియా నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. కన్నడ సినిమాతో ‘కిరిక్ పార్టీ’తో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ అనంతరం సౌత్ ఇండియాలోని ఇతర ఇండస్ట్రీలలో అడుగుపెట్టి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

Rashmika Mandanna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న సౌత్ ఇండియా నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. కన్నడ సినిమాతో ‘కిరిక్ పార్టీ’తో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ అనంతరం సౌత్ ఇండియాలోని ఇతర ఇండస్ట్రీలలో అడుగుపెట్టి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. గతేడాది వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌ (Bollywood)లోకి అడుగుపెట్టిన ఈ భామ అక్కడ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

అమితాబ్‌ బచ్చన్‌‌‌తో కలిసి చేసిన ‘గుడ్ బై’ అనే సినిమాతో రష్మిక బాలీవుడ్‌కి పరిచయమైంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌గా నిలిచింది. అలాగే త్వరలో మరికొన్ని సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో రష్మిక హిందీ కెరీర్‌పై సినీ విశ్లేషకుడినని చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ (KRK) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమెని హిందీ ఆడియన్స్ హీరోయిన్‌గా చూడలేరని చెప్పుకొచ్చాడు.

కేఆర్‌కే మాట్లాడుతూ.. ‘ఆమె లుక్స్‌ని బట్టి చూస్తే, రష్మిక మందన్నా దక్షిణాది చిత్రాలకు, భోజ్‌పురి చిత్రాలకు చాలా బాగా సెట్ అవుతుంది. కానీ హిందీ చిత్రాలకు మాత్రం ఆమె ఎంపిక తప్పు. ఐశ్వర్యా రాయ్, మాధురి, కరీనా కపూర్ వంటి హీరోయిన్లని చూసిన హిందీ ప్రేక్షకులు రష్మికని ప్రధాన కథానాయికగా అంగీకరించలేరు’ అని రాసుకొచ్చాడు.

Updated Date - 2022-12-28T11:43:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!