KRK: ‘ఆర్ఆర్ఆర్ వల్ల నిర్మాతలకు 200 కోట్ల నష్టం’

ABN , First Publish Date - 2022-12-06T18:53:08+05:30 IST

బాలీవుడ్ సినిమాల మీద విమర్శలు చేస్తూ పాపులారిటీ సాధించిన నటుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan)..

KRK: ‘ఆర్ఆర్ఆర్ వల్ల నిర్మాతలకు 200 కోట్ల నష్టం’

బాలీవుడ్ సినిమాల మీద విమర్శలు చేస్తూ పాపులారిటీ సాధించిన నటుడు కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan). తనకి తానే క్రిటిక్ అని హిందీ చిత్రాలపై ట్వీట్స్ చేస్తూ పలుమార్లు వివాదాల పాలవుతూ ఉంటాడు. దానికి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాడు. ఈ క్రిటిక్ తాజాగా సైతం బాలీవుడ్ సినిమాలపై, పాన్ ఇండియా సినిమాలపై వివాదాస్పద ట్వీట్స్ చేశారు. అందులో ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) సినిమాలు నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయని తెలిపాడు.


కేఆర్‌కే చేసిన ట్వీట్‌లో.. ‘ఈ సంవత్సరంలో టాప్ 5 డిజాస్టర్స్!.. ‘బ్రహ్మాస్త్రం’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పృథ్వీరాజ్’, ‘లాల్ సింగ్ చడ్డా’, ‘విక్రమ్ వేదా’ అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్‌లో.. ‘బ్రహ్మాస్త్ర వల్ల రూ.300 కోట్లు..  ఆర్ఆర్ఆర్ వల్ల రూ.200 కోట్లు.. పృథ్వీరాజ్ వల్ల రూ.150 కోట్లు.. లాల్ సింగ్ చడ్డా వల్ల రూ.125 కోట్లు.. విక్రమ్ వేదా వల్ల రూ.100 కోట్లు.. నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి’ అని రాసుకొచ్చాడు.


నిజానికి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఎంతోమంది కేఆర్‌కే ట్వీట్ మీద స్పందిస్తూ.. ఆయన చెప్పింది నిజమా అంటూ ఆశ్చర్యపోతూ కొందరు.. అది నిజం కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.





Updated Date - 2022-12-06T18:53:08+05:30 IST

Read more