ఆ హీరోలు నాతో సినిమా చేయడానికి భయపడుతున్నారు : బాలీవుడ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-03-17T18:00:19+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘1 నేనోక్కడినే’ సినిమాతో సినీ పరిశ్రమకి...

ఆ హీరోలు నాతో సినిమా చేయడానికి భయపడుతున్నారు : బాలీవుడ్ బ్యూటీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘1 నేనోక్కడినే’ సినిమాతో సినీ పరిశ్రమకి పరిచయమైన నటి కృతిసనన్. అనంతరం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి గుర్తింపునే సాధించింది. స్టార్ హీరోలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఈ భామ తాజాగా నటించిన చిత్రం ‘బచ్చన్ పాండే’. అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. త్వరలో విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ని చిత్రబృందం జోరుగా చేస్తోంది. అందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.


కృతి మాట్లాడుతూ.. ‘తమతో పాటు హీరోయిన్స్‌కి సమ పాధాన్యత, స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి ఇష్టపడే హీరోలు చాలా తక్కువ మందిలో ఉన్నారు. అందులోనూ నాకు 60 శాతం, హీరోకి 40 శాతం ఉన్న పాత్ర చేయడానికి సిద్ధపడే పరిస్థితులు లేవనే చెప్పాలి. అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఎవరూ ఇష్టపడలేదు కూడా. కానీ అక్షయ్ కుమార్‌కి మాత్రం ఎలాంటి అభద్రతాభావం లేదు. అందుకే ఆయన గత చిత్రం ‘అత్రాంగి రే’లో ఎంతో పాముఖ్యత ఉన్న చిన్న పాత్రలో నటించాడు. అలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేం’ అంటూ చెప్పుకొచ్చింది.


కృతి ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, డ్రామా, థ్రిల్ అన్నీ ఉన్నాయి. అవి సినిమాకి ఎంతో ప్లస్ అవుతాయి. ఇందులో ఎంతో మోడ్రన్‌గా ఆలోచించే అమ్మాయిగా నటించాను. ఇలాంటి పాత్రని ఈ మధ్య చేయలేదు. కోపం వస్తే తనని ఏ క్షణంలోనైనా చంపేసే గ్యాంగ్‌స్టర్‌తో సినిమా తీయాలనుకునే ధైర్యమైన అమ్మాయి పాత్ర ఇది. అదే నాకు ఎంతో ఇంట్రస్టింగ్‌గా అనిపించింది’ అని తెలిపింది.


అయితే.. తమిళంలో సిద్ధార్థ్‌ హీరోగా 2014లో వచ్చిన ‘జిగర్తాండ’కి రిమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదే చిత్రం తెలుగులోనూ హారీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేశ్’గా రీమేక్ అయ్యింది. కాగా.. ఇందులో కృతి సనన్‌తో పాటు జాక్వెలిన్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

Updated Date - 2022-03-17T18:00:19+05:30 IST

Read more