Koffee With Karan: ‘ఊ అంటావా మావా’కు స్టెప్పులేసిన సమంత, అక్షయ్
ABN, First Publish Date - 2022-07-20T22:43:04+05:30
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). గతంలో ఈ చాట్ షో ఆరు సీజన్లు ప్రసారమయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా కరణ్
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న చాట్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan). గతంలో ఈ చాట్ షో ఆరు సీజన్లు ప్రసారమయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫలితంగా కరణ్ జోహార్ 7వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్’ (Disney+Hotstar) లో ఈ చాట్ షో స్ట్రీమింగ్ అవుతుంది. రికార్డ్ వీక్షణలతో దూసుకుపోతుంది. బాలీవుడ్ తారలు ఆలియా భట్, రణ్వీర్ సింగ్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ తదితరులు ఇప్పటికే ఈ షోకు హాజరై సందడి చేశారు. ఈ సారి సౌత్ సెలబ్రిటీలు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్న ఎపిసోడ్‌కు సమంత (Samantha) అతిథిగా హాజరు కానుంది. అక్షయ్ కుమార్ (Akshay kumar)తో కలసి సందడి చేయనుంది. ఈ ఎపిసోడ్లో అక్షయ్‌తో కలసి సామ్ ‘ఊ అంటావా మావా..ఊఊ అంటావా మావా’కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.
అంతకు ముందు కరణ్ జోహార్ (Karan johar) సమంత ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ప్రోమోలో.. అక్షయ్ కుమార్ సీటు దగ్గరకు సమంతను ఎత్తుకుని తీసుకొచ్చాడు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ చలాకీగా సమాధానమిచ్చారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీని హోస్ట్ చేస్తే డ్యాన్స్ చేయమని ఏ బాలీవుడ్ హీరోలను అడుగుతారు? అని సమంతను ప్రశ్నించగా రెండు సార్లు ‘రణ్‌వీర్‌సింగ్’ అని చెప్పుకొచ్చింది. పెళ్లి ప్రస్తావనను కరణ్ తీసుకురాగా ‘అన్‌హ్యాపీ మ్యారేజేస్కు నువ్వే కారణం’ అని సామ్ కౌంటర్ ఇచ్చింది. సమంత ఇంకేం మాట్లాడిందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ జులై 21న స్ట్రీమింగ్ కానుంది.