కొత్త కప్పులో సరికొత్త కాఫీ... Koffee With Karan రిటర్న్స్!

ABN , First Publish Date - 2022-05-08T23:42:26+05:30 IST

గత కొన్ని రోజులుగా ‘కాఫీ విత్ కరణ్’ టైటిల్ జనం నోళ్లలో నానుతోంది. అందుక్కారణం, మొదట్లో ప్రచారమైన పుకార్లు. ఇక ‘కాఫీ విత్ కరణ్’ టీవీ తెర మీదకు రానేరాదంటూ కలకలం రేగింది. ఆ పైన బుల్లితెర మీదకు రాదుగానీ... ఓటీటీలో అలరిస్తుందని తేలిపోయింది! తాజాగా ‘కాఫీ విత్ కరణ్ 7’ సీజన్ కోసం సెట్ పైన కనిపించాడు కరణ్ జోహర్. ఆయన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి...

కొత్త కప్పులో సరికొత్త కాఫీ... Koffee With Karan రిటర్న్స్!

గత కొన్ని రోజులుగా ‘కాఫీ విత్ కరణ్’ టైటిల్ జనం నోళ్లలో నానుతోంది. అందుక్కారణం, మొదట్లో ప్రచారమైన పుకార్లు. ఇక ‘కాఫీ విత్ కరణ్’ టీవీ తెర మీదకు రానేరాదంటూ కలకలం రేగింది. ఆ పైన బుల్లితెర మీదకు రాదుగానీ... ఓటీటీలో అలరిస్తుందని తేలిపోయింది! తాజాగా ‘కాఫీ విత్ కరణ్ 7’ సీజన్ కోసం సెట్ పైన కనిపించాడు కరణ్ జోహర్. ఆయన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి... 

కాఫీ విత్ కరణ్ తాజా సీజన్ కోసం ఆల్ బ్లాక్ ఔట్ ఫిట్ ధరించిన కేజో గోల్డెన్ అండ్ యెల్లో లైట్స్ తో మెరిసిపోతోన్న గార్జియస్ సెట్ మీదకు చేరుకున్నాడు! ఆ సమయంలో తీసిన ఫోటోల్ని ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మళ్లీ ఘుమఘుమలాడే కాఫీకి టైమైందంటూ ఇంగ్లీషులో క్యాప్షన్ ఇచ్చాడు... 

‘కాఫీ విత్ కరణ్’ టీవీ మీద నుంచీ ఓటీటీకి షిఫ్ట్ అయిందని ప్రకటించిన కరణ్ జోహర్ గెస్ట్ లిస్టు గురించిన లీక్స్ కూడా అందిస్తున్నాడు. అయితే, ఎక్కడా ఆయన ఎవరీ పేరు అధికారికంగా చెప్పలేదు. కానీ, ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ జంట రణవీర్, ఆలియా పాల్గొంటారని చెబుతున్నారు. సౌత్ నుంచీ ‘పుష్ప’ జోడీ అల్లు అర్జున్, రశ్మిక మందణ్ణ కనిపించబోతారట. 

‘కాఫీ విత్ కరణ్ 7’ కేవలం డిస్నీ+హాట్ స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పైనే అందుబాటులో ఉండనుంది. జూన్ నుంచీ జనం ముందుకు రానున్న తాజా సీజన్ విషయంలో కరణ్ జోహార్ మంచి జోష్ లో ఉన్నాడు. మోర్ ఫన్ అండ్ స్టైల్ తో... బిగ్గర్ అండ్ బెటర్ గా షో ఉండబోతోందని చెబుతున్నాడు. చూడాలి మరి, టెలివిజన్ లో సాధించిన సక్సెస్ ‘కాఫీ విత్...’ ఓటీటీలో కూడా సాధిస్తుందో లేదో... 

Updated Date - 2022-05-08T23:42:26+05:30 IST

Read more