ఆ రోజు నుంచే Koffee With Karan 7

ABN , First Publish Date - 2022-06-19T21:20:37+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ షో ఆరు సీజన్‌లు ప్రసారమయి శ్రోతలను ఆకట్టుకుంది. ఫలితంగా

ఆ రోజు నుంచే Koffee With Karan 7

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ చాట్ షో ఆరు సీజన్‌లు ప్రసారమయి శ్రోతలను ఆకట్టుకుంది. ఫలితంగా కరణ్ జోహార్ ఈ షో 7వ సీజన్‌ను ప్రేక్షకులకు ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్‌’ (Disney+Hotstar) లో ఈ చాట్ షో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించాడు. గతంలో ఈ షో టీవీలో ప్రసారమయింది. తాజాగా అతడు ‘కాఫీ విత్ కరణ్-7’ స్ట్రీమింగ్ డేట్‌ను తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సీజన్ భారీగా, అద్భుతంగా, అందంగా ఉంటుందని తెలిపాడు. 


‘కాఫీ విత్ కరణ్-7’ చాట్ షో డిజిటల్ ప్లాట్‌ఫాం ‘డిస్నీ+హాట్ స్టార్‌’ లో జులై 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని కరణ్ జోహారే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అందుకు సంబంధించిన ప్రొమోను అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రొమోలో.. షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, కరీనా కపూర్, రణ్‌వీర్ సింగ్ తదితరులు కనిపించారు. కరణ్ గతంలో ఈ షోలో అనేక మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశాడు. రాఖీ సావంత్, కపిల్ శర్మ, రానా దగ్గుబాటి, ప్రభాస్, హార్దిక్ పాండ్యా, కేఎల్. రాహుల్ తదితరులు ఈ చాట్ షోలో సందడి చేశారు. కరణ్ జోహార్  ‘కాఫీ విత్ కరణ్-7’ కు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో గతంలోనే ఇచ్చాడు. ‘‘ప్రతి గొప్ప కథకు ఓ మంచి ట్విస్ట్ తప్పక ఉండాలి. ‘కాఫీ విత్ కరణ్’ తిరిగి టీవీలో ప్రసారం కాదు. ఈ చాట్ షో 7వ సీజన్ ‘డిస్నీ+హాట్ స్టార్‌’ లో ప్రసారం కానుంది. భారత్‌కు చెందిన పెద్ద తారలందరూ కాఫీ తాగుతూ ఈ షోలో పాల్గొనబోతున్నారు. వదంతులకు చెక్ పెట్టి లోతైన చర్చలను జరపడానికి ఈ షో సిద్ధంగా ఉంది’’ అని ట్విట్టర్‌లో కరణ్ పోస్ట్ పెట్టాడు.Updated Date - 2022-06-19T21:20:37+05:30 IST

Read more